Ramani Kalyanam: కళ్లు లేని అమ్మాయి.. నడవలేని అబ్బాయి.. మనసును హత్తుకునేలా ‘రమణి కళ్యాణం’ ట్రైలర్!

Ramani Kalyanam

Ramani Kalyanam

భారీ యాక్షన్, హంగామా సినిమాల మధ్య ప్రేక్షకులకు ఒక స్వచ్ఛమైన ఫీల్ గుడ్ ఎంటర్‌టైనర్‌ను అందించేందుకు వస్తున్న చిత్రం ‘రమణి కళ్యాణం’. కైట్స్ క్రియేటివ్స్ బ్యానర్‌పై విజయ్ ఆదిరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ట్రైలర్ తాజాగా విడుదలై, ఫ్యామిలీ ఆడియన్స్‌ను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఇప్పటికే టీజర్, టైటిల్ సాంగ్‌తో బజ్ క్రియేట్ చేసిన ఈ చిత్రం.. తాజా ట్రైలర్‌తో అంచనాలను అమాంతం పెంచేసింది.

“కోల్పోయిన ప్రతి వారి దగ్గర ఒక కథ ఉంటుంది” అనే పవర్ ఫుల్ అండ్ ఎమోషనల్ డైలాగ్‌తో ఈ ట్రైలర్ మొదలవుతుంది. ఈ కథలో ప్రధానంగా రెండు పాత్రలు కనిపిస్తాయి. సంజన.. కళ్లు లేని ఓ బ్లైండ్ ఆర్జే (RJ) మరియు సింగర్. మరోవైపు రాజ్.. నడవలేని స్థితిలో ఉంటాడు. ఇలాంటి ఇద్దరు వ్యక్తుల మధ్య పుట్టిన స్వచ్ఛమైన ప్రేమకథను దర్శకుడు విజయ్ ఆదిరెడ్డి ఎక్కడా బలవంతపు డ్రామా లేకుండా, చాలా నాచురల్‌గా, ఎంటర్‌టైనింగ్‌గా చూపించిన తీరు ట్రైలర్‌లో హైలైట్‌గా నిలిచింది. ఈ చిత్రంలో సూర్య వశిష్ట, దీప్షిక చంద్రన్ తమ పాత్రల్లో ఒదిగిపోయారు. వారిద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు, సంభాషణలు చాలా నాచురల్‌గా వర్కౌట్ అయ్యాయి. ముఖ్యంగా సైలెంట్ ఎమోషన్స్ ట్రైలర్‌కు మంచి ఫీల్ తీసుకొచ్చాయి. ఇక ‘కోర్ట్’ ఫేమ్ రామ్ జగదీష్ రాసిన డైలాగ్స్ నేరుగా ప్రేక్షకుడి హార్ట్‌ను టచ్ చేసేలా ఉన్నాయి.