Ramani Kalyanam: కళ్లు లేని అమ్మాయి.. నడవలేని అబ్బాయి.. మనసును హత్తుకునేలా ‘రమణి కళ్యాణం’ ట్రైలర్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారీ యాక్షన్, హంగామా సినిమాల మధ్య ప్రేక్షకులకు ఒక స్వచ్ఛమైన ఫీల్ గుడ్ ఎంటర్టైనర్ను అందించేందుకు వస్తున్న చిత్రం ‘రమణి కళ్యాణం’. కైట్స్ క్రియేటివ్స్ బ్యానర్‌పై విజయ్ ఆదిరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ట్రైలర్ తాజాగా విడుదలై, ఫ్యామిలీ ఆడియన్స్‌ను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఇప్పటికే టీజర్, టైటిల్ సాంగ్‌తో బజ్ క్రియేట్ చేసిన ఈ చిత్రం.. తాజా ట్రైలర్‌తో అంచనాలను అమాంతం పెంచేసింది.
“కోల్పోయిన ప్రతి వారి దగ్గర ఒక కథ ఉంటుంది” అనే పవర్ ఫుల్ అండ్ ఎమోషనల్ డైలాగ్‌తో ఈ ట్రైలర్ మొదలవుతుంది. ఈ కథలో ప్రధానంగా రెండు పాత్రలు కనిపిస్తాయి. సంజన.. కళ్లు లేని ఓ బ్లైండ్ ఆర్జే (RJ) మరియు సింగర్. మరోవైపు రాజ్.. నడవలేని స్థితిలో ఉంటాడు. ఇలాంటి ఇద్దరు వ్యక్తుల మధ్య పుట్టిన స్వచ్ఛమైన ప్రేమకథను దర్శకుడు విజయ్ ఆదిరెడ్డి ఎక్కడా బలవంతపు డ్రామా లేకుండా, చాలా నాచురల్‌గా, ఎంటర్టైనింగ్గా చూపించిన తీరు ట్రైలర్లో హైలైట్‌గా నిలిచింది. ఈ చిత్రంలో సూర్య వశిష్ట, దీప్షిక చంద్రన్ తమ పాత్రల్లో ఒదిగిపోయారు. వారిద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు, సంభాషణలు చాలా నాచురల్‌గా వర్కౌట్ అయ్యాయి. ముఖ్యంగా సైలెంట్ ఎమోషన్స్ ట్రైలర్‌కు మంచి ఫీల్ తీసుకొచ్చాయి. ఇక ‘కోర్ట్’ ఫేమ్ రామ్ జగదీష్ రాసిన డైలాగ్స్ నేరుగా ప్రేక్షకుడి హార్ట్‌ను టచ్ చేసేలా ఉన్నాయి.
Also Read
- Secret Soldiers: 'చైనా' పేరుతో సెన్సార్ బోర్డ్‌లో ప్రకంపనలు.. రంగంలోకి విదేశీ వ్యవహారాల శాఖ!
- Nehal Vadoliya : ప్రాణాలకు ముప్పు ఉంది.. తమన్నా మాజీ ప్రియుడు విజయ్ వర్మపై నటి సంచలన ఆరోపణలు!
- Pranay Reddy Vanga: కోడిగుడ్డు మీద ఈకలు పీకేవాళ్లకు ఓపెన్ ఛాలెంజ్.. ‘స్పిరిట్’ను ఆపే దమ్ముందా?
- Amit Majithia: స్టార్ క్రికెటర్ల పరువు గంగపాలు? దుబాయ్ రహస్య విందుల్లో బయటపడ్డ దిమ్మతిరిగే నిజాలు!
తాజావార్తలు
-
Greenfield Highway : గ్రీన్‌ఫీల్డ్ హైవేపై మృత్యుఘోష.. ఒకే రోజు మూడు ప్రమాదాలు
-
Happy Journey : వందల ఫోన్ నెంబర్లున్నా మాట్లాడుకోలేని ఒంటరితనం.. మనందరి కథే ‘హ్యాపీ జర్నీ’..
-
Secret Soldiers: ‘చైనా’ పేరుతో సెన్సార్ బోర్డ్‌లో ప్రకంపనలు.. రంగంలోకి విదేశీ వ్యవహారాల శాఖ!
-
OTR: సిగ్గా.. భయమా.. మొహమాటమా? అంజిరెడ్డి తీరుపై బీజేపీలో హాట్ టాపిక్
-
OTR: సిక్కోలులో వైసీపీకి గ్రూపుల గోల! స్థానిక ఎన్నికల వేళ అసలు రచ్చ ఇదేనా?
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!