Ramajogaiah Sastry Clarity on His Comments at Devara Sucess Meet: జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన దేవర చిత్రం మొదటి భాగం నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాకి మొదటి ఆట నుంచే పాజిటివ్ టాక్ వచ్చింది, తర్వాత కొంత టాక్ డివైడ్ అయింది. అయితే నిన్న మధ్యాహ్నం సినిమా యూనిట్ ఒక సక్సెస్ మీట్ నిర్వహించింది. ఈ సక్సెస్ మీట్ లో దర్శకుడు కొరటాల శివ, డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు, నిర్మాత కళ్యాణ్ రామ్ తో పాటు ఈ సినిమాకి లిరిక్స్ రాసిన రామ జోగయ్య శాస్త్రి కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రామ జోగయ్య శాస్త్రి మాట్లాడుతూ ఉన్న ఒక ఇంటర్వ్యూలో కొరటాల శివ గారు అన్నట్టు ఎవరి పని వాళ్ళని చేసుకొనిస్తే విజయం ఇలా ఉంటుంది.
Jani Master: జానీ మాస్టర్ వ్యవహారం వెనుక బడా హీరో.. భార్య కీలక వ్యాఖ్యలు
దర్శకుడిని నమ్మినటువంటి హీరో ఉంటే మరింత బలంగా ఉంటుంది విజయం అని ఈ దేవర సినిమా ద్వారా మరొకసారి నిరూపితమైంది. ఇలాంటి సినిమాలో నా భాగస్వామ్యం ఉన్నందుకు మరొకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఇది కేవలం ఆరంభం మాత్రమే అనిపిస్తుంది. ఈ సినిమా ఎక్కడెక్కడికి వెళ్లి పోతుందో చెప్పలేమనిపిస్తోంది అంటూ ఆయన చెప్పుకొచ్చారు. అయితే ఈ విషయం గురించి సోషల్ మీడియాలో రకరకాల చర్చలు జరుగుతున్న నేపథ్యంలో ఓరి నాయనో ఇది ఎటో దారితీస్తోన్నట్టుంది నా ఉద్దేశ్యం శివగారు తన టెక్నీషియన్స్ కి స్వేచ్ఛనిస్తారని..అంతే తప్ప మరొకటి కాదు విపరీతార్ధాలు తీయవద్దని మనవి 🙏అంటూ రామజోగయ్య శాస్త్రి ట్వీట్ చేశారు. ఇక కొరటాల శివ చేసిన ఎవరి పని వాళ్ళని చేసుకొనిస్తే కామెంట్స్ లో ద్వంద్వార్థాలు తీస్తూ రకరకాల కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు.
ఓరి నాయనో
ఇది ఎటో దారితీస్తోన్నట్టుంది
నా ఉద్దేశ్యం శివగారు తన టెక్నీషియన్స్ కి
స్వేచ్ఛనిస్తారని..అంతే తప్ప మరొకటి కాదు
విపరీతార్ధాలు తీయవద్దని మనవి 🙏 https://t.co/UPFfDcZxgT— RamajogaiahSastry (@ramjowrites) September 27, 2024