Ramabanam Triler: మ్యాచో స్టార్ గోపీచంద్, డింపుల్ హయాతీ జంటగా శ్రీవాస్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం రామబాణం. లక్ష్యం, లౌక్యం సినిమాలతో హిట్ అందుకున్న ఈ కాంబో.. ఈసారి హ్యాట్రిక్ హిట్ కొట్టడానికి రెడీ అయ్యారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ఈ చిత్రం మే 5 న రిలీజ్ కానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్, సాంగ్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఇక తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. ట్రైలర్ ను బట్టి.. యాక్షన్, కామెడీ, సెంటిమెంట్ మిక్స్ చేసి కొట్టినట్లు తెలుస్తోంది.
Jagapathi Babu: ‘రంగస్థలం’ సర్పంచ్.. పుష్ప 2 లో.. సుకుమార్ సినిమాటిక్ యూనివర్స్ ..?
” ఈ క్షణం.. ఈ ప్రయాణం నేను ఊహించింది కాదు.. ప్లాన్ చేసింది కాదు” అంటూ గోపీచంద్ తన గతాన్ని వివరిస్తున్నట్లు తెలుస్తోంది. స్వచ్ఛమైన ఆహరం, మంచి బంధాలే మనిషిని కాపాడతాయి అని నమ్మే అన్న.. కుటుంబాలు ఇప్పుడు ఎక్కడ కలిసి ఉంటున్నాయి అని నమ్మే తమ్ముడు. అలా ఈ అన్నదమ్ముల జీవితంలోకి విలన్ వస్తాడు. అన్న నడుపుతున్న క్యాంటిన్ కు విరుద్ధంగా కెమికల్స్ కలిపిన ఫుడ్ తో విలన్స్ ప్రజలను చంపేస్తున్న తరుణంలో వారికి అన్న జగపతి బాబు పోరాడతాడు. ఆ పోరాటంలో అన్న చనిపోవడంతో తమ్ముడు గోపీచంద్ అన్న లక్ష్యాన్ని ఎలా నెరవేర్చాడు.. అన్నను చంపినవారిపై ఎలా పగతీర్చుకున్నాడు..? అనేది కథగా తెలుస్తోంది. ఇక యాక్షన్ కు యాక్షన్.. కామెడీ కి కామెడీ.. గ్లామర్ కు డింపుల్.. అన్నదమ్ముళ్ల సెంటిమెంట్.. మొత్తాన్ని ఒక్క ట్రైలర్ లో కట్ చేసి చూపించేశారు. ఇక మిక్కీ జె మేయర్ సంగీతం సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది అని చెప్పొచ్చు. గోపీచంద్ డైలాగ్ డెలివరీ అల్టిమేట్.. వీడు తమ్ముడులా లేడు టెర్మినేటర్ లా ఉన్నాడు అనే ఎలివేషన్ అయితే ట్రైలర్ కు హైలైట్ గా నిలిచింది. మొత్తానికి శ్రీవాస్.. మ్యాచో హీరోకు గట్టి హిట్ ఇచ్చేలానే కనిపిస్తున్నాడని ట్రైలర్ చూస్తుంటే అర్ధమవుతోంది. మరి ఈ కాంబో హ్యాట్రిక్ హిట్ కొడుతుందో లేదో చూడాలి.