‘రామ్ వర్సెస్ రావణ్’ షూటింగ్ ప్రారంభం
సొలమన్ జడ్సన్, రాజ్ బాలా, మనో చిత్ర, అనన్య మణి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా ‘రామ్ వర్సెస్ రావణ్’. ఈ చిత్రంలో సప్తగిరి మరో కీలక పాత్రలో నటిస్తున్నారు. కె. శుక్రన్ దర్శకత్వంలో డాక్టర్ ఎ.ఎస్. జడ్సన్ దీనిని నిర్మిస్తున్నారు. ఈ సినిమా ప్రారంభోత్సవం హైదరాబాద్ రామానాయుడు స్టూడియోలో జరిగింది. దర్శకుడు మారుతి, ఫైట్ మాస్టర్స్ రామ్ లక్ష్మణ్, నిర్మాత ‘సిందూరపువ్వు’ కృష్ణారెడ్డి అతిథులుగా హాజరై చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా దర్శకుడు కె . శుక్రన్ మాట్లాడుతూ, ”నేను దర్శకత్వ శాఖలో రాజమౌళి గారి దగ్గర ‘బాహుబలి’ సినిమాకు పనిచేశాను. అంతకముందు వైవీఎస్ చౌదరి, శ్రీనివాస రెడ్డి, ఎన్. శంకర్ గారి దగ్గర వర్క్ చేశాను. నాకు మొదట ‘ఏంజెల్’ సినిమాతో దర్శకుడిగా అవకాశం ఇచ్చింది ‘సిందూరపువ్వు’ కృష్ణారెడ్డి గారు. ఇక ఈచిత్ర కథ విషయానికి వస్తే, ఇదొక పల్లెటూరిలో జరిగే కథ. ఆ ఊరి మంచి కోసం ఇద్దరు యువకులు ఎలా పోరాటం చేశారు అనేది సినిమాలో చూపిస్తున్నాం. యాక్షన్ తో పాటు ఎంటర్ టైన్ మెంట్ కథలో కలిసి ఉంటుంది” అని అన్నారు.
Also Read
హీరో సొలమన్ జడ్సన్ మాట్లాడుతూ, ”ఈ చిత్రంలో నేను రామ్ క్యారెక్టర్ చేస్తున్నాను. పల్లెటూరిలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు ఏమిటీ? వాటిని పరిష్కరించేందుకు రామ్, రావణ్ అనే యువకులు ఏం చేశారు? ఎలా పోరాడారు? అనేది కథ. ఈ సినిమాలో ఎమోషనల్ ఎలిమెంట్స్ తో పాటు మంచి కామెడీ కూడా ఉంటుంది. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించి, వీలైనంత త్వరగా సినిమాను మీ ముందుకు తీసుకొస్తాం” అని చెప్పారు. ఈ చిత్రంలో తాను రావణ్ పాత్ర చేస్తున్నట్టు రాజ్ బాలా చెప్పారు.
తాజావార్తలు
-
Reliance Q4 FY26 Results: రిలయన్స్ ఇన్వెస్టర్లకు షాక్.. ఆదాయం పెరిగినా లాభం ఎందుకు తగ్గింది? అంబానీ రిపోర్ట్ కార్డ్ ఇదే!
-
Rajasekhar : ఠాగూర్ సినిమా చిరంజీవి కంటే ముందే నా దగ్గరకు వచ్చింది.. కానీ
-
Panama Canal: హార్మూజ్ జలసంది మూసివేత..! ఒక్కో ట్యాంకర్‌పై రూ.37 కోట్లు సంపాదిస్తున్న ఓ చిన్న దేశం..
-
Kavitha: కవిత ‘TRS’ పార్టీ 5 భారీ హామీలు ఇవే.. విద్య, వైద్యం ఉచితం.. 4 లక్షల ఉద్యోగాలే లక్ష్యం!
-
Ashok mittal-Kejriwal: నమ్మినవాడే షాకిచ్చాడు.. మొన్నటిదాకా అశోక్ మిట్టల్ ఇంట్లోనే ఉన్న కేజ్రీవాల్
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్‌వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్‌ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!