Site icon NTV Telugu

RAM: దేశభక్తి చిత్రంగా రాపిడ్‌ యాక్షన్‌ మిషన్‌.. ఆసక్తిరేపుతున్న ఫస్ట్ లుక్

Ram Movie

Ram Movie

RAM- Rapid Action Mission Glimpse Released: ఈమధ్య కాలంలో రియల్ స్టోరీలను ఆధారంగా చేసుకుని తెరకెక్కిస్తున్న సినిమాలు ఎక్కువయ్యాయి. రియల్ లైఫ్‌లో జరిగిన సంఘటనలను బేస్ చేసుకొని తెరకెక్కుతున్న సినిమాలు అన్ని వర్గాల ప్రేక్షకాదరణ పొంది విజయం సాధిస్తున్న క్రమంలో నిజ జీవిత కథలను తెరపై ఆవిష్కరించి ప్రేక్షకులను థ్రిల్ చేస్తున్నారు మేకర్స్. ఈ నేపథ్యంలో దీపిక ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై ఓఎస్‌ఎం విజన్‌తో కలిసి ప్రొడక్షన్‌ నెం.1గా రామ్‌ (RAM/ర్యాపిడ్ యాక్షన్ మిషన్) అనే సినిమా రూపొందిస్తున్నారు. దేశభక్తి నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమా నుంచి తాజాగా ఫస్ట్ లుక్, గ్లింప్స్‌ ను డైరెక్టర్ పరశురామ్ రిలీజ్ చేశారు. ఈ గ్లింప్స్‌లో దేశాన్ని, దేశ ప్రజలను ఉద్దేశిస్తూ హీరో చెప్పిన డైలాగ్ హైలైట్ గా ఉండగా హీరో డైలాగ్ డెలివరీకి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మరింత ప్లస్ అయింది.

3 Ekka: 20 రోజుల్లో 25 కోట్లు.. రికార్డులు బద్దలు కొడుతున్న గుజరాతీ సినిమా

ఈ సీన్ షూట్ చేసిన లొకేషన్ హీరో పవర్ ఫుల్ డైలాగ్‌కి యాప్ట్ అయ్యేలా ఉండగా ఈ గ్లింప్స్ సినిమా మొత్తాన్ని కళ్ల ముందు కదలాడేలా చేసింది. రామ్ (RAM- రాపిడ్‌ యాక్షన్‌ మిషన్‌) టైటిల్ మధ్యలో కనిపిస్తున్న అశోక చక్రం ఇంట్రెస్ట్ పెంచేయగా టైటిల్ లుక్ తోనే ప్రేక్షకులు బాగా కనెక్ట్ అయ్యేలా ఉంది. దీపికాంజలి వడ్లమాని నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ సినిమాతో సూర్య అయ్యలసోమయాజుల హీరోగా పరిచయం కాబోతుండగా మిహిరామ్ వైనతేయ దర్శకుడిగా అరంగేట్రం చేస్తున్నారు. వైనతేయ ఈ మూవీకి కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ కూడా అందించగా ధన్య బాలకృష్ణ హీరోయిన్ గా నటిస్తోంది. ఇక ఈ సినిమాలో భాను చందర్, సాయి కుమార్, రోహిత్, శుభలేఖ సుధాకర్, రవివర్మ, మీనా వాసు, అమిత్ కుమార్ తివారీ, భాషా తదితరులు ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తుండగా ఆశ్రిత్ అయ్యంగార్ సంగీతం అందిస్తున్నారు.

Exit mobile version