Site icon NTV Telugu

Ram Pothineni : ఆంధ్రా కింగ్ కోసం రామ్ కొత్త ప్రయోగం.. ఇది కూడా భాగ్యశ్రీ కోసమేనా?

Andhra King.

Andhra King.

ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని ప్రస్తుతం నటిస్తున్న తాజా చిత్రం ‘ఆంధ్రా కింగ్’ . ఇస్మార్ట్ శంకర్‌తో సూపర్ హిట్ కొట్టిన రామ్, ఆ తర్వాత చేసిన డబుల్ ఇస్మార్ట్, ది వారియర్ వంటి సినిమాలు ఆశించిన స్థాయిలో సక్సెస్ ఇవ్వకపోవడంతో కాస్త వెనుకబడ్డాడు. ఇప్పుడు మళ్లీ ట్రాక్‌లోకి రావాలని రామ్ ప్రయత్నిస్తున్న ప్రాజెక్ట్ ఇదే. అయితే ఈ సినిమా కోసం రామ్ ఇంతకు ముందెన్నడూ చేయని ప్రయోగం చేశాడు. అదేంటంటే.. ఆయన స్వయంగా ఒక పాట రాశాడు. లిరిక్స్ కూడా అద్భుతంగా రావడంతో అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. అయితే ఈ పాట వెనుక నిజమైన కారణం మరోదేనని టాక్ వస్తోంది. రామ్ తన కో-స్టార్ భాగ్యశ్రీ బోర్సే కోసం ఈ పాట రాశారనే రూమర్స్ ఫిల్మ్ నగరంలో గుసగుసలుగా వినిపిస్తున్నాయి.

Also Read : Ravi Teja : 2 నెలల్లో డబుల్ ట్రీట్ కి సిద్ధమవుతున్న రవితేజ?

సినిమా షూటింగ్ మొదలైనప్పటి నుంచి రామ్–భాగ్యశ్రీల మధ్య ఏదో ఉందని టాక్ నడుస్తూనే ఉంది. వీరిద్దరూ సోషల్ మీడియాలో షేర్ చేసే పోస్టులు కూడా చాలా సారూప్యంగా ఉండటంతో ఫ్యాన్స్‌లో డౌట్స్ పెరిగాయి. అందుకే “భాగ్యశ్రీ కోసం రాసిన పాటే ఇది.. ప్రేమలో ఉన్నవారే ఇలాంటివి రాయగలరు” అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇక తాజాగా మరో వార్త హల్‌చల్ చేస్తోంది. రామ్ పోతినేని ఆంధ్రా కింగ్ కోసం కేవలం పాట రాయడమే కాకుండా, తన కెరీర్‌లో ఫస్ట్ టైమ్ స్వయంగా ఓ పాట కూడా పాడబోతున్నాడట. ఇప్పటివరకు ఎన్నో సినిమాలు చేసినా, ఒక్కసారైనా మైక్ పట్టని రామ్, ఈసారి ఎందుకు ఇలా చేస్తున్నాడో అన్న అనుమానం ఫ్యాన్స్‌లో ఉంది. “ఇంతవరకూ పాట పాడని రామ్, ఇప్పుడు ఒక్కసారిగా పాడాలని నిర్ణయించుకోవడమేంటి? ఇది కూడా భాగ్యశ్రీ కోసమేనా?” అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి. మరి ఈ ఊహాగానాలన్నింటికీ రామ్ ఎలాంటి స్పందన ఇస్తాడో చూడాలి.

Exit mobile version