ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని కథానాయకుడిగా నటిస్తూ, స్వీయ దర్శకత్వం వహించబోతున్న క్రేజీ ప్రాజెక్ట్‌కు సంబంధించిన పనులు శరవేగంగా జరుగుతున్నాయి. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాకు సంబంధించిన పూర్తి స్క్రిప్ట్ వర్క్ పూర్తయింది. పలువురు దర్శకులు రచనా సహకారం అందించిన ఈ స్క్రిప్ట్‌ను రామ్ ఫైనల్‌గా లాక్ చేసేశారు. ప్రస్తుతం ఈ సినిమాలో నటించబోయే కీలక నటీనటుల ఎంపికపై యూనిట్ దృష్టి పెట్టింది.
ఈ సినిమాలో విలన్ పాత్ర అత్యంత కీలకం. అందుకోసం విలక్షణమైన నటుడుని తీసుకోవాలని అన్వేషిస్తున్నారు. అందులో భాగంగా తమిళ ఇండస్ట్రీలో మోస్ట్ వాంటెడ్ వర్సటైల్ యాక్టర్ అయిన ఎస్.జె. సూర్య పేరును చిత్ర బృందం పరిశీలిస్తోంది. నిజానికి ఈ పాత్ర కోసం మొదట మలయాళ స్టార్ నటుడు ఫహద్ ఫాజిల్ ను సంప్రదించినట్లు టాక్ వచ్చింది. అయితే రెమ్యునరేషన్స్ తో పాటు కొన్ని కారణాల వల్ల ఇప్పుడు ఎస్.జె. సూర్య వద్దకు ఈ ప్రతిపాదన వచ్చింది. ప్రస్తుతం ఆయనతో రెమ్యునరేషన్ విషయమై చర్చలు జరుగుతున్నాయి. అన్ని అనుకూలంగా కుదిరితే సూర్య ఈ ప్రాజెక్ట్‌లోకి అఫీషియల్‌గా ఎంట్రీ ఇవ్వడం ఖాయం. ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో కథానాయికగా ‘కేజీఎఫ్’ బ్యూటీ శ్రీనిధి శెట్టిని ఎంపిక చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోంది. ఇంకా అధికారికంగా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ప్రస్తుతం చర్చల దశలోనే ఉందనేది యూనిట్ టాక్. రామ్ స్వయంగా మెగాఫోన్ పడుతుండటంతో ఈ సినిమాపై అభిమానుల్లో ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. మలయాళ మ్యూజిక్ సెన్సేషన్ సామ్ సీస్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.
