Site icon NTV Telugu

Ram Pothineni: రామ్ సంచలన నిర్ణయం.. కెరీర్ పోతుందా..?

Ram

Ram

Ram Potineni: స్క్రిప్ట్ డిమాండ్ చేయాలే కానీ ఎలాంటి పాత్రలోనైనా ఒదిగిపోగల నటులు టాలీవుడ్ లో ఉన్నారు అని చెప్పుకోవడానికి ఏ మాత్రం సంకోచించాల్సిన అవసరం లేదు. పాత్రల కోసం ప్రాణాలు పెట్టే హీరోలు ఉన్న ఇండస్ట్రీలో ఉన్నాం. ప్రయోగాలు చేయడానికి ఎప్పుడు సిద్ధంగానే ఉంటారు టాలీవుడ్ హీరోలు. సన్నగా కనిపించాలా..? లావుగా కనిపించాలా..? అంగవైకల్యం, గెటప్స్.. ఏదైనా సరే మేము రెడీ అని చెప్పేస్తున్నారు. అయితే ఇక్కడివరకు బాగానే ఉన్నా.. కొన్నిసార్లు అలా చేసిన ప్రయోగాలు వర్క్ అవుట్ అవుతాయి. కొన్నిసార్లు ఫెయిల్ అవుతాయి. బరువు పెరగడం సులభమే కానీ బరువు తగ్గడం ఎంతో కష్టంతో కూడుకున్న పని. ఈ మధ్య ప్రభాస్, ఎన్టీఆర్ సినిమాల కోసం బరువు పెరిగి కనిపించారు. ఇక యంగ్ హీరో శర్వానంద్ ఒక ప్రమాదం కారణంగా బరువు పెరిగారు. బరువు అయితే పెరిగారు కానీ, తగ్గడానికి చాలా కష్టపడ్డారు. దానివలన ఎన్నో ట్రోల్స్ ను ఎదుర్కొంటున్నారు. ఇలాంటి ప్రయోగాలు చేసేటప్పుడు కొద్దిగా ఆలోచించండి అంటున్నారు హీరోల ఫ్యాన్స్. ప్రస్తుతం ఇలాంటి రిస్క్ చేస్తున్నాడు ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని.

ఇటీవలే వారియర్ సినిమాతో పరాజయాన్ని అందుకున్న రామ్ ఈసారి ఎలాగైనా హిట్ అందుకోవాలని చూస్తున్నాడు. ప్రస్తుతం రామ్.. బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న విషయం తెల్సిందే. ఇక ఈ సినిమా కోసం రామ్ ఒక సంచలన నిర్ణయం తీసుకున్నాడని టాక్ వినిపిస్తోంది. కథ డిమాండ్ చేయడంతో తన పాత్ర కోసం దాదాపు 11 కేజీలు బరువు పెరగనున్నాడట. ఇందులో రామ్ డబుల్ రోల్ లో కనిపించనున్నాడట. ఇద్దరికీ వేరియేషన్ కనిపించడానికి, ఆ పాత్రకు ఉన్న ప్రాముఖ్యతను బట్టి రామ్ బరువు పెరగడానికి ఒప్పుకున్నాడని సమాచారం. ఇక ఈ విషయం తెలియడంతో రామ్ అభిమానులు ఆ తప్పు చేయొద్దని చెప్తున్నారు. బరువు పెరిగాకా తగ్గడం చాలా కష్టమని, ఇలాంటి ప్రయోగాలు ఇప్పట్లో వద్దని సలహాలు ఇస్తున్నారు. కెరీర్ పీక్స్ లో ఉన్న సమయంలో ప్రయోగాలు చేసి ప్లాప్ అయితే కెరీర్ పోతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరి రామ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో చూడాలి.

Exit mobile version