Site icon NTV Telugu

Ram Pothineni: ఉస్తాద్ పెళ్లికి ముహూర్తం ఫిక్స్.. అమ్మాయి ఎవరంటే?

Ram Pothineni Marriage

Ram Pothineni Marriage

టాలీవుడ్ మోస్ట్ బ్యాచిలర్స్ లో ఒకడైన రామ్ పోతినేని.. త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడు. తన చిన్ననాటి స్నేహితురాలు, స్కూల్ మేట్ అయిన ఓ అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నాడు. కొంతకాలం నుంచి ప్రేమలో ఉన్న వీళ్లిద్దరు.. పెళ్లి బంధంతో ఒక్కటవ్వాలని నిర్ణయించుకున్నారు. కుటుంబ సభ్యులు సైతం వీరి నిర్ణయంతో ఏకీభవించడంతో, పెళ్లి కార్యక్రమాల్ని మొదలుపెట్టేందుకు సన్నద్ధమవుతున్నట్టు తెలిసింది. ఆగష్టు నెల శ్రావణ మాసంలో నిశ్చితార్థం జరగొచ్చని, నవంబర్‌‌ నెల కార్తిక మాసలో పెళ్ళి నిశ్చయించొచ్చని తెలుస్తోంది. త్వరలోనే ఈ విషయమై అధికార ప్రకటన రానుందని సమాచారం.

ఇక సినిమాల విషయానికొస్తే.. ‘ఇస్మార్ట్ శంకర్’తో ఉస్తాద్ గా అవతరించిన రామ్, ఆ తర్వాత రెడ్ చిత్రంతోనే హిట్ కొట్టాడు. ఆ సినిమాకి పాజిటివ్ టాక్ రాకపోయినా, బాక్సాఫీస్ వద్ద మాత్రం మంచి రన్ కొనసాగించింది. ప్రస్తుతం తమిళ దర్శకుడు లింగుసామి దర్శకత్వంలో ‘వారియర్’ అనే బైలింగ్వల్ సినిమా చేస్తున్నాడు. వచ్చే నెల 14వ తేదీన ఈ సినిమా విడుదల కానుంది. అటు.. ఊరమాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలోనూ ఔట్ అండ్ ఔట్ మాస్ ఓరియంటెడ్ సినిమా చేయబోతున్నాడు. త్వరలోనే ఇది సెట్స్ మీదకి వెళ్లనుంది. దీనిని భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా సినిమాగా రూపొందిస్తున్నారు.

Exit mobile version