NTV Telugu Site icon

#BoyapatiRAPO: అమ్మ దీనమ్మ.. ఏం ఉన్నావ్ బాసూ..

Ram

Ram

#BoyapatiRAPO:గతేడాది ది వారియర్ సినిమాతో అభిమానుల ముందుకొచ్చాడు ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని. ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. కోలీవుడ్ డైరెక్టర్ లింగుసామి దర్శకత్వంలో వచ్చిన ఆ సినిమాలో రామ్ పోలీస్ కమ్ డాక్టర్ గా నటించి మెప్పించాడు. ఇక ఈ సినిమా తరువాత రామ్, మాస్ డైరెక్టరో బోయపాటి శ్రీను దర్శకత్వంలో RAPO20 చేస్తున్న విషయం తెల్సిందే. అఖండ లాంటి హిట్ తరువాత బోయపాటి, రామ్ తో చేస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ చిత్రంలో రామ్ సరసన శ్రీలీల నటిస్తోంది. ఇక ఈ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్న రామ్.. మీడియా ముందు కనిపించడం తగ్గించేశాడు. ఇక తాజాగా ముంబై ఎయిర్ పోర్ట్ లో రామ్ కనిపించడంతో కెమెరాలు తమ కంటికి పనిచెప్పాయి.

Oscar: ‘ఆస్కార్’ మరచిపోలేని విల్ స్మిత్ దెబ్బ!

మొదటి నుంచి రామ్ స్టైలిష్ లుక్ లో మెస్మరైజ్ చేస్తూ ఉంటాడు. టాలీవుడ్ కుర్ర హీరోల్లో ఫ్యాషన్ ను ఫాలో అయ్యేవారిలో రామ్ కూడా ఒకడు. ఇక తాజాగా ఎయిర్ పోర్ట్ లో రామ్ స్టైలిష్ లుక్ అదిరిపోయింది. అల్ట్రా స్టైలిష్ లుక్ లో రామ్ దర్శనమివ్వడం ఆలస్యం ఫోటోగ్రాఫర్ లు క్లిక్కులు మీద క్లిక్కులు ఇచ్చేశారు. వైలెట్ కలర్ టీ షర్ట్ పై బ్లాక్ కలర్ షర్ట్ .. అది కూడా ఎంతో స్టైలిష్ గా చివరి బటన్స్ పెట్టి.. బ్లాక్ గాగుల్స్.. ఫుల్ గడ్డం.. ఆ హెయిర్ స్టైల్ కు అయితే కుర్రాళ్ళు ఫిదా అవ్వడం ఖాయమని చెప్పాలి. రగ్గడ్ లుక్ లో రామ్ పిచ్చెక్కించేశాడు. దీంతో ప్రస్తుతం రామ్ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఈ లుక్ చూసిన అభిమానులు అమ్మ దీనమ్మ.. ఏం ఉన్నావ్ బాసూ.. అంటూ కామెంట్స్ చేస్తున్నారు. RAPO20 రామ్ ను బోయపాటి ఏ విధంగా చూపించనున్నాడో చూడాలి. మరి ఈ సినిమాతో ఈ కుర్ర హీరో ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.

Show comments