NTV Telugu Site icon

Ram Gopal Varma: వ్యూహం టీజర్ చూడమని వారిని నేనేం అడుక్కోను..

Varma

Varma

Ram Gopal Varma: వివాదస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వివాదాలను కావాలని కొనితెచ్చుకోవడంలో వర్మ తరువాతే ఎవరైనా. ఇక ఒకప్పుడు ఇండస్ట్రీ హిట్స్ అందించిన వర్మ.. ఇప్పుడు రాజకీయ బయోపిక్ లు అని, శృంగార మూవీస్ అని అభిమానుల చేత విమర్శలు అందుకుంటున్నాడు. ఇక ఎలక్షన్స్ రానున్న నేపధ్యంలో వర్మ.. జగన్ బయోపిక్ తీస్తున్నట్లు చెప్పుకొచ్చాడు. దానికి వ్యూహం అని పేరు పెట్టి.. షూటింగ్ ను కూడా పూర్తి చేశాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్, టీజర్ రిలీజ్ చేసి సెన్సేషన్ క్రియేట్ చేసాడు. ఇక తాజాగా వ్యూహం టీజర్ 2 ను రిలీజ్ చేశాడు. ఇందులో పవన్ కళ్యాణ్, చంద్రబాబు, జగన్, భారతి, చిరంజీవి, సోనియా గాంధీ.. తదితర పాత్రలను చూపించాడు. ప్రస్తుతం ఈ టీజర్ గురించే ఏపీలో చర్చ జరుగుతుంది అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఇక ఈ సినిమాపై రాజకీయపరంగా చాలా చర్చలే జరుగుతున్నాయి. అయినా వాటిని లెక్కచేయని వర్మ .. ట్విట్టర్ లో ట్వీట్స్ చేస్తూ ఇంకా రెచ్చగొడుతూనే ఉన్నాడు. తాజాగా.. ఈ టీజర్ ను చూడమని తానెవ్వరిని అడుక్కోను.. అంటూ ట్వీట్ చేశాడు.

Mohan Babu: ఆ మాట అంటే చెప్పు తీసుకుని కొడతానన్నా!

” వ్యూహం టీజర్ చూడమని.. చంద్రబాబు ను, పవన్ కళ్యాణ్ ను, సోనియా గాంధీని, చిరంజీవిని, నారాలోకేష్ ను మరియు జగన్ మోహన్ రెడ్డిని అభ్యర్ధించను” అని రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది. ఇక ఈ ట్వీట్ పై అభిమానులు తమదైన రీతిలో స్పందిస్తున్నారు. నువ్వు ఎంత బతిమిలాడినా వారెవ్వరూ చూడరు.. కొన్ని పేటీఎం బ్యాచ్ లు తప్ప.. అని కొందరు. ఎలాంటి సినిమాలు తీసేవాడివి.. ఎలా మారిపోయావు.. అని ఇంకొందరు చెప్పుకొస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ సినిమా ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తోందో చూడాలి.

Show comments