Site icon NTV Telugu

Ram Gopal Varma: పవన్ అభిమాని ఎటకారాలు.. బాగా ఎక్కువయ్యాయే

Varma

Varma

Ram Gopal Varma: వివాదాలు సృష్టించడంలో రామ్ గోపాల్ వర్మ తరువాతే ఎవరైనా.. అసలు వివాదాలు లేని వారిపై కూడా వివాదాలు సృష్టించగల సమర్థుడు ఆర్జీవీ. ఇక మొదటినుంచి వర్మకు జగన్ అంటే ఇష్టమన్న విషయం తెల్సిందే. దాంతోనే జగన్ ను ఎప్పటికప్పుడు పొగుడుతూ మిగతా రాజకీయ నేతలను తనదైన శైలిలో విమర్శిస్తూ ఉంటాడు. ముఖ్యంగా జనసేన, టీడీపీ పై వర్మ చేసిన వ్యాఖ్యలు ఎప్పటికప్పుడు వైరల్ గా మారుతూనే ఉన్నాయి. ఇక నిన్నటి నుంచి మనోడి చూపు మొత్తం వారాహి మీదనే ఉంది. పవన్ వారాహి వ్యాన్ కు పూజలు చేయించడం దగ్గరనుంచి మొదలుపెట్టాడు. పవన్ అభిమానిగా చెప్తున్నా.. అంటూ ఆయనమీదే సెటైర్లు వేస్తూ వస్తున్నాడు.

“ఆ రోజుల్లో రామారావు గారు “చైతన్య రథం” మీద తిరిగితే, మీరు”పంది బస్సు” మీద తిరుగుతున్నారు అంటున్న తప్పుడు నా కొడుకులందర్నీ జనసేనలతో బస్సు టైర్లకింద తొక్కించేయండి సార్! ఒకవేళ అలా చేయడం లీగల్ గా కుదరదనుకుంటే కనీసం కేసులన్నా పెట్టించండి.. పవన్ కళ్యాణ్ గారూ.ఇది మీ ఫ్యాన్ గా నా విన్నపం”. “గుడిలో ఉంటే అది “వారాహి” రోడ్డు మీద ఉంటే అది “పంది”.. పీ,తన పందికి “వారాహి” అని పేరు పెట్టుకోవడం ఆ దేవతని దారుణంగా అవమానించినట్టే” అని కొన్ని కుక్కలు మొరుగుతున్నాయి. వెంటనే వాళ్ళ నోర్లు మూయించక పోతే మన పవిత్ర “వారాహి”ని ఒక “పంది బస్సు” గా ముద్ర వేస్తారు” అంటూ ట్వీట్స్ మీద ట్వీట్స్ చేస్తున్నాడు. దీంతో పవన్ అభిమానులు.. తమదైన రీతిలో వర్మకు కౌంటర్లు వేస్తున్నారు. నీ వెధవ ఎటకారాలు మాకు తెల్సులే.. పవన్ అభిమాని ఎటకారాలు.. బాగా ఎక్కువయ్యాయే అని కొందరు.. వోడ్కా వేసి మాట్లాడితే చెల్లుతోంది అని అనుకుంటున్నావా..? అని మరికొందరు చెప్పుకొస్తున్నారు.

Exit mobile version