Ram Gopal Varma: వివాదస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అయితే సినిమాలు.. లేకపోతే రాజకీయాలు.. వీటిలో చిచ్చు పెట్టి సంతోషించడం వర్మకు ఉన్న అలవాటు. ముఖ్యంగా జనసేన, టీడీపీ గురించి వర్మ ఎంతవ్యతిరేకంగా మాట్లాడతాడో అందరికి తెల్సిందే. ఇక ఎన్నికల సమయం కావడంతో మరింత ఫోకస్ చేస్తున్నాడు. జనసేనను ట్రోల్ చేయడంలో వర్మ తరువాతే ఎవరైనా.. ఇక నిన్నటికి నిన్న.. పవన్ కళ్యాణ్ ఒక ప్రెస్ మీట్ లో “137 స్ధానాల్లో గతంలో పోటీ చేసినప్పుడు 30-40 సీట్లయినా రావాలని, అప్పుడు సీఎం పదవి అడిగే పరిస్ధితి ఉండేడి కాదు. కానీ ఓట్లేయకుండా ఇప్పుడు సీఎం పదవి కావాలని కోరుకోవడం తప్పు.. సీఎం పదవి డిమాండ్ చేయాలంటే 30-40 సీట్లు ఉండాలి” అని చెప్తూ తాను సీఎం రేసులో లేనని చెప్పుకొచ్చాడు.
Bandla Ganesh: బ్రేకింగ్.. రాజకీయాల్లోకి బండ్లన్న రీ ఎంట్రీ.. ఏ పార్టీలో..?
ఇక ఈ వ్యాఖ్యలు విన్న తరువాత వర్మ తాన్ ట్విట్టర్ లో రెచ్చిపోయాడు. పవన్ కళ్యాణ్.. జనసైనికులకు వెన్నుపోటు పొడిచాడు అంటూ చెప్పుకొచ్చాడు. ఎన్టీఆర్, చంద్రబాబును వెన్నుపోటు పొడిచిన దానికంటే బలంగా పవన్ .. అభిమానులను వెన్నుపోటు పొడిచినట్లు చెప్పుకొచ్చాడు. ఇక కొద్దిసేపటి క్రితం.. ఇనాయ సుల్తానాతో సిగరెట్ తాగుతున్న ఫోటోను షేర్ చేస్తూ..’RIP’ జనసేన.. మేము బాధపడుతున్నాం అంటూ క్యాప్షన్ పెట్టుకొచ్చాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది. ఇక దీంతో జనసైనికులు.. వర్మపై విరుచుకుపడ్డారు.. వోడ్కా తాగి వాగుతున్నావ్.. నోరు కంట్రోల్ లో పెట్టుకో అని కొందరు.. ఇది బాధ కాదు.. స్త్రీల మీద వ్యసనం.. పవన్ పట్ల పైశాచికత్వం.. అని ఇంకొందరు కామెంట్స్ పెడుతున్నారు.
Baadhalo memiddharam 😢😢😢 https://t.co/u7I8ZNl8SS
— Ram Gopal Varma (@RGVzoomin) May 12, 2023
