NTV Telugu Site icon

Ram Gopal Varma: కేసీఆర్‌‌ ఈజ్ ఆదిపురుష్.. వర్మ పొగిడాడా? విమర్శించాడా?

Ram Gopal Varma

Ram Gopal Varma

Ram Gopal Varma: టాలీవుడ్‌ సంచలన దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఎప్పుడు ట్విట్టర్‌‌లో ఏదో ఓ ట్వీట్‌ చేస్తూ వర్మ అందరికీ షాక్‌ ఇస్తుంటాడు. వర్తమాన విషయాలపై స్పందించే వర్మ తాజాగా టీఆర్ఎస్ పార్టీ పేరు మార్పుపైనా రియాక్ట్ అయ్యాడు. ఈ మేరకు టీఆర్ఎస్‌ను బీఆర్ఎస్‌గా మార్చిన కేసీఆర్ తొలి ఆదిపురుష్ అయ్యారంటూ రాంగోపాల్ వర్మ ట్వీట్ చేశాడు. జాతీయ రాజకీయాల్లోకి కేసీఆర్‌ అడుగుపెడుతున్నందుకు స్వాగతం పలికాడు. అయితే కేసీఆర్‌ను వర్మ ఆదిపురుష్ అనడంతో కొందరు నెటిజన్‌లు ఇది పొగడ్త లేదా విమర్శ అని సందేహం వ్యక్తం చేస్తున్నారు.

Read Also: Bharat Rashtra Samithi: బీఆర్ఎస్‌పై కేసీఆర్‌ ప్రకటన ఇదే..

ప్రస్తుతం ఎక్కడ చూసినా సోషల్ మీడియాలో ఆదిపురుష్ పదమే వినిపిస్తోంది. ఆదిపురుష్ టీజర్ గురించి సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. ట్రోల్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ టీజర్‌లో హిందూ దేవతలను దర్శకుడు ఓం రౌత్ తప్పుగా చూపించాడంటూ పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హిందూ దేవతల వస్త్రధారణ భిన్నంగా ఉందని.. హనుమంతుడు లెదర్ వేసుకున్నట్లు చూపడం ముమ్మాటికీ తప్పేనని మధ్యప్రదేశ్ హోంమంత్రి నరోత్తమ్ మిశ్రా తీవ్రంగా మండిపడ్డారు. మరోవైపు ట్రోల్స్ వస్తున్నా ఆదిపురుష్ టీజర్ రికార్డులను క్రియేట్ చేస్తోంది. 24 గంటట్లో వంద మిలియన్లకు పైగా వ్యూస్ సాధించిన టీజర్‌గా రికార్డు సాధించింది.

 

Show comments