Site icon NTV Telugu

Ram Gopal Varma: నాగబాబు.. చిరు, పవన్ లకు ఎక్కువేమో.. నాకు కాదు

Rgv

Rgv

Ram Gopal Varma: వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఈసారి జనసేన మీద పడ్డాడు. గట్టిగా పవన్ కళ్యాణ్ పై కౌంటర్లు వేసింది కాకుండా పవన్ అభిమానిగా చెప్తున్నా అంటూ సెటైర్లు వేశాడు. ఇక కమ్మ.. కమ్మ.. కాపు.. కాపు అని లెక్కల ట్వీట్… పవన్ కళ్యాణ్ కాపులను అమ్మేశాడని మరో ట్వీట్ వేసి రాజకీయాల్లో హీట్ పెంచాడు. ఇక తన అన్నను కానీ, తమ్ముడుని కానీ ఒక మాట అంటే పడలేని నాగబాబు.. వర్మ వ్యాఖ్యలపై మండిపడ్డాడు.. వర్మ ఒక సన్నాసి.. వర్మ ఒక వెధవ.. నీచ కమీన్ కుత్తే.. అతను మేము పట్టించుకోము.. మీరు కూడా పట్టించుకోవద్దు అంటూ నాగబాబు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు. ఇక నాగబాబు అన్న మాటలకు వర్మ బాగా హార్ట్ అయ్యాడు. దీంతో నాగబాబు మాటలపై స్పందిస్తూ వీడియో రిలీజ్ చేశాడు.

” కొణిదెల నాగబాబు… ఆయన తమ్ముడికి లేక అన్నయ్యకు ఇంపార్టెంట్ అయ్యి ఉండొచ్చు.. నాకు కాదు. నేను జనసేన మీదకాని పవన్ కళ్యాణ్ మీద చేసిన ట్వీట్స్ పవన్ కళ్యాణ్ అభిమానిగా చేసాను.అది అర్ధం అవ్వకపోకడం నా దురదృష్టం అంతకన్నా ఎక్కువ పవన్ కళ్యాణ్ దురదృష్టం. కేవలం తన అన్నయ్య కాబట్టి ఇలాంటి సరాధాలను మాత్రమే పెట్టుకుంటే దాని తరువాత పవన్ కళ్యాణ్ అవుట్ కమ్ ఏమిటో జనమే చెపుతారు” అంటూ వీడియో రిలీజ్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఏం.. వర్మ వోడ్కా వేసి చెప్తున్నావా..? అని కొందరు.. మరికొందరు ఎందుకురా.. మెగా ఫ్యామిలీ అంటే అంత కోపం నీకు అని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు.

Exit mobile version