Site icon NTV Telugu

RGV : హీరోస్ ఆర్ జీరోస్… ఆయన చుట్టూ జూనియర్ ఆర్టిస్టుల్లా…

RGV

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో సినీ ఇండస్ట్రీ సమస్యలపై చిరు బృందం రీసెంట్ గా చర్చలు జరిపిన విషయం తెలిసిందే. అయితే ఈ భేటీపై వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియా వేదికగా సెటైర్లు వేస్తూనే ఉన్నారు. వరుస ట్వీట్లతో భేటీలో పాల్గొన్న ప్రముఖులను టార్గెట్ చేస్తున్నారు. హీరోస్ ఆర్ జీరోస్ అంటూ ఆర్జీవీ చేసిన పలు వివాదాస్పద వ్యాఖ్యలపై నెటిజన్లు మండిపడుతున్నారు.

Read Also : Ghani : సెన్సార్ కార్యక్రమాలు పూర్తి

తాజాగా ఆర్జీవీ “చాలా సాధారణ ప్రజాప్రతినిధిగా వైఎస్ జగన్ గారు, పేర్ని నాని గారు సూపర్… మెగా, బాహుబలి స్టార్స్ అందరికంటే చాలా పెద్ద స్టార్స్ లా కనిపిస్తున్నారు. ఎందుకంటే భిక్షాటన చేసే రీల్ స్టార్స్ సూపర్ ఆరాధన ట్వీట్లు పెట్టారు. రియల్ స్టార్స్ వైఎస్ జగన్, పేర్ని నాని ట్వీట్ చేయడానికి ఇబ్బంది లేదు… y మహేష్, చిరంజీవి, ప్రభాస్ మొదలైనవారు జూనియర్ ఆర్టిస్టుల లాగా ఒమెగా స్టార్ చుట్టూ కూర్చున్నారు… దీన్నిబట్టి వైఎస్ జగన్ నిజమైన మెగా సూపర్ డూపర్ ఒమేగా స్టార్ అని నిరూపితమైంది. రీల్ లైఫ్ లో మహేష్, చిరు, ప్రభాస్ తదితరులు ఫ్రేమ్ మధ్యలో పంచ్ డైలాగ్స్ ఇస్తూ ఉంటారు. నిజ జీవితంలో వైఎస్ జగన్ ఫ్రేమ్ మధ్యలో వాళ్లు భయపడ్డారు. భిక్ష కోసం జూనియర్ ఆర్టిస్టుల్లా వేడుకున్నారు. వైఎస్ జగన్ అప్పర్ ఆఫ్ అండర్ స్టార్స్‌ను బహిర్గతం చేశారు.

గౌరవనీయులైన ముఖ్యమంత్రి ఒమేగా స్టార్‌ వైఎస్ జగన్ ను చూసి నేను ఆశ్చర్యపోయాను. ఎందుకంటే సూపర్ మెగా స్టార్స్ అందరూ ఒకే వరుసలో… “హీరోస్ ఆర్ జీరోస్”లాగా అని ఆయన నిరూపించారు #HeroesAreZeroes” అంటూ సంచలన ట్వీట్లు చేశారు.

Exit mobile version