Site icon NTV Telugu

Bheemla Nayak : ఆర్జీవీ రివ్యూ… ఏమన్నాడంటే?

bheemla nayak

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఏం చేసినా సెన్సేషనే అన్న విషయం తెలిసిందే. తాజాగా ఈ డైరెక్టర్ ‘భీమ్లా నాయక్’ రివ్యూ ఇచ్చి అందరికీ షాక్ ఇచ్చారు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో “భీమ్లా నాయక్”మేనియా కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈరోజు ఉదయం నుంచి థియేటర్లలో “భీమ్లా నాయక్” సందడి చేస్తున్నాడు. మొదటి షో నుంచే సినిమాకు అద్భుతమైన స్పందన వస్తోంది. అయితే మెగా ఫ్యామిలీపై ఎప్పుడూ విమర్శలు కురిపించే ఆర్జీవీ తాజాగా పవన్ “భీమ్లా నాయక్” రివ్యూ ఇవ్వడం ఆసక్తికరంగా మారింది. అసలు సినిమా ఎలా ఉందన్న విషయాన్ని వెల్లడిస్తూ ఆర్జీవీ సోషల్ మీడియాలో షేర్ చేసిన పోస్టు వైరల్ అవుతోంది.

Read Also : Bheemla Nayak : జగన్ కక్ష సాధింపు చర్య… మూర్ఖత్వం వీడాలంటున్న చంద్రబాబు

‘భీమ్లా నాయక్’ మూవీని ఉరుములతో పోలుస్తూ… పవన్ సునామీ లాంటివాడని, రానా దగ్గుబాటి పూర్తిగా అద్భుతమని ప్రశంసలు కురిపించారు. మొత్తం మీద ఈ మూవీ భూకంపం లాంటిదని చెప్పుకొచ్చాడు. అంతేకాదు “నేను పదే పదే చెబుతున్నట్లుగా ‘భీమ్లా నాయక్‌’ని హిందీలో కూడా విడుదల చేస్తే బాగుంటుంది. అది సంచలనం సృష్టించి ఉండేది” అంటూ ఆర్జీవీ చేసిన కామెంట్స్ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. మరోవైపు వర్మ నిజంగానే ‘భీమ్లా నాయక్’ని పొగిడాడా ? లేదా ఇన్ డైరెక్ట్ గా ఏమన్నా సెటైర్లు వేశాడా ? అనేది అర్థంకాక చర్చ మొదలెట్టేశారు. మరి వర్మ ఈ కామెంట్స్ పాజిటివ్ గా చేశాడా ? లేక నెగెటివ్ గానా అన్నది ఆయనకే తెలియాలి.

https://www.youtube.com/watch?v=FJQFcHXlJJM
Exit mobile version