Ramgopal Varma: వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సంచలనాలను సృష్టించడంలో పెద్ద దిట్ట. తన సినిమాను హిట్ చేయడానికి ఎలాంటి బోల్డ్ ప్రమోషన్స్ అయినా చేస్తాడు. తాజాగా బోల్డ్ బ్యూటీ అషు రెడ్డితో బోల్డ్ ఇంటర్వ్యూ చేసి షాక్ ఇచ్చాడు. ముఖ్యంగా అషు కాళ్లు చీకడం, ముద్దాడడం లాంటి చీప్ పనులు చేసి నెటిజన్ల ఆగ్రహానికి గురి అయ్యాడు. ఛీఛీ.. ఇదేం పాడుపని.. సిగ్గులేకుండా కెమెరా ముందు ఇలాంటి పనులు ఏంటి ఏకిపారేశారు. ముఖ్యంగా అషును దిగజారిపోయిందని, అసలు ఇంట్లోవాళ్లు ఎలా ఒప్పుకున్నారు అంటూ విమర్శించారు. ఇక తాజాగా ఈ విమర్శలపై వర్మ వివరణ ఇచ్చాడు. అది కూడా తన స్టైల్లో నెటిజన్లకు కౌంటర్ ఇచ్చాడు. అషు రెడ్డి కాలి బొటన వేలుని నేను ఎందుకు చీకానో, ఇది నా స్టేట్మెంట్ అంటూ ఒక వీడియో రిలీజ్ చేశాడు.
“ప్రతి ఒక్కరు లైఫ్ లో కష్టపడి పనిచేస్తారు. కానీ.. అందరికి ఎంటర్టైన్ మెంట్ అనేది అవసరం. ఆ ఎంటర్టైన్ మెంట్ కోసం కొందరు స్పోర్ట్స్ ఆడతారు, ఇంకొందరు పేకాట ఆడుతారు.. ఇంకా సినిమా చూడటం.. ఇలా వాళ్ళ టేస్ట్ కి తగ్గట్టుగా ఒక్కొక్కటీ ఎంచుకుంటారు. మీకు ఇష్టం లేకపోతే చూడటం మానేయండి.. వేరే పనులు లేవా మీకు? అదంతా కేవలం నా ఎంటర్టైన్ మెంట్ కోసం.. ఆ టైమ్ లో నేనేం ఫీల్ అయ్యానో అదే చేశాను. ఎప్పుడైనా సరే నేనేం ఫీల్ అవుతానో అదే మాట్లాడతాను. అషురెడ్డి కాళ్లను ముద్దాడటం కూడా అంతే.. వీడియో చూడకపోతే వెళ్లిపోండి.. నేనేమి పట్టుకు కూర్చోలేదు..” అంటూ ఘాటుగా సమాధానం చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
అషు రెడ్డి కాలి బొటన వేలుని నేను ఎందుకు చీకానో , ఇది నా స్టేట్మెంట్ https://t.co/myDiU71osv
— Ram Gopal Varma (@RGVzoomin) December 10, 2022
