Site icon NTV Telugu

నీకేంటి నొప్పి… వైరల్ వీడియోపై ఆర్జీవీ రియాక్షన్

Ram Gopal Varma response on Viral Video

కొన్ని రోజులు వివాదాలకు విరామం ఇచ్చిన వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మళ్ళీ తన వ్యాఖ్యలతో వార్తల్లో నిలుస్తున్నారు. ఇటీవల ఆయన ఓ అమ్మాయితో ఫుల్ జోష్ లో డ్యాన్స్ చేసిన వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అయ్యింది. స్వయంగా ఆ వీడియోను షేర్ చేసిన ఆర్జీవీ అందులో ఉన్నది ‘నేను మాత్రం కాదు’ అంటూ కామెంట్ చేశాడు. ఈ వీడియో ఎంతగా వైరల్ అయ్యిందో అంతే రచ్చ కూడా జరిగింది. పెద్ద ఎత్తున చర్చలు కూడా నడుస్తున్నాయి. అయితే ఇంతవరకూ సైలెంట్ గా ఉన్న వర్మ తాజాగా ఓ మీడియా ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ రచ్చపై స్పందించారు. అసలు మీరు అమ్మాయితో అలా డ్యాన్స్ చేయడం కరెక్ట్ అనుకుంటున్నా? అని ప్రశ్నించారు. దానికి ఆయన తనపై విమర్శలను కురిపిస్తున్న వారిని ఉద్దేశిస్తూ “నీకేం నొప్పి.. మేము ఇద్దరం మేజర్లం… మా ఇష్టం వచ్చినట్లు మేము చేస్తాం. మధ్యలో మీకేంటి ?” అని నేరుగా ప్రశ్నించారు. అంతేకాకుండా ఆ అమ్మాయితో ఉన్న పిక్ ను షేర్ చేసి ఆ అమ్మాయి నాతో ఇబ్బంది పడుతున్నట్లు కన్పిస్తుందా ? ఆమె సంతోషంగా ఉంది. నేను కూడా సంతోషంగా ఉన్నా ? ఆక్కడ ఉన్నవాళ్లు కూడా ఆనందంగా ఉన్నారు ? మధ్యలో వాళ్లెవరికో ప్రాబ్లెమ్ ఏంటి ? అంటూ చెప్పడం చర్చనీయాంశంగా మారింది.

Read also : రాంగ్ ఛాయిస్… సుశాంత్ ఒక చక్రంలో ఇరుక్కుపోయాడు : త్రివిక్రమ్

ఇదిలా ఉంటే నిన్నటికి నిన్న రియల్ మెగాస్టార్ అల్లు అర్జున్ అంటూ మరోసారి మెగా ఫ్యాన్స్ ను రెచ్చగొట్టే ప్రయత్నం చేశాడు. మిగతావారంతా చిరంజీవి మీద పడి తింటున్న పారాసైట్ లు అంటూ మెగా హీరోల పేర్లతో సహా ట్వీట్ చేశాడు. అల్లు అర్జున్ తనకు తానుగా నిలదొక్కుకున్నాడు కాబట్టే చిరంజీవి బర్త్ డే వేడుకలో కన్పించలేదంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మరోవైపు ఈ విషయంపైనా రచ్చ నడుస్తోంది. మెగా ఫ్యాన్స్ ఆర్జీవిని ఏకి పారేస్తున్నారు.

Exit mobile version