Site icon NTV Telugu

Siva: మోహన్‌బాబు లేనందునే.. ‘శివ’ విజయం సాధ్యమైంది – వర్మ

Shiva

Shiva

తెలుగు సినిమా చరిత్రలో కొత్త దశను ఆరంభించిన సినిమా అంటే అది ‘శివ’. రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో నాగార్జున హీరోగా వచ్చిన ఈ చిత్రం అప్పట్లో విప్లవాత్మక మార్పులు తెచ్చింది. కొత్తదనంతో, రియలిస్టిక్ ప్రెజెంటేషన్‌తో సినిమా ఇండస్ట్రీనే మార్చేసిందని చెప్పొచ్చు. ఇప్పుడు ఈ సినిమాను అత్యాధునిక 4K క్వాలిటీతో మళ్లీ నవంబర్ 14న విడుదల చేయబోతున్నారు. ఈ సందర్భంగా ‘శివ’కి సంబంధించిన ఓ ఆసక్తికరమైన విషయం బయటకు వచ్చింది.

Also Read : Girlfriend : సినిమా తీయడం కాదు ముందు ప్రమోట్ చేయడం నేర్చుకోండి – నిర్మాత ధీరజ్ మొగిలినేని

ఈ సినిమాలోని రఘువరన్ దగ్గర పనిచేసే రౌడీ గణేష్ పాత్ర కోసం నిర్మాత అక్కినేని వెంకట్ ప్రముఖ నటుడు మోహన్ బాబు పేరును సూచించారట. హీరోకు వార్నింగ్ ఇచ్చే ఆ సీన్ మరింత పవర్‌ఫుల్‌గా ఉండాలంటే ప్రజలకు తెలిసిన యాక్టర్ అయితే బాగుంటుందని ఆయన భావించారని సమాచారం. కానీ వర్మ మాత్రం మోహన్‌బాబు పేరును వెంటనే తిరస్కరించారట. దానికి కారణం కూడా చెప్పారట వర్మ “మోహన్‌బాబు గారు తెలుగు ప్రేక్షకులకు ఫ్యామిలిమ్యాన్. ఆయన మాట్లాడిన ప్రతీ డైలాగ్‌కి ప్రత్యేకమైన స్టైల్‌ ఉంటుంది. అలాంటి వ్యక్తి రౌడీ పాత్రలో వస్తే ప్రేక్షకుడు ఆ సీన్‌లో మోహన్‌బాబునే చూస్తాడు, కానీ ఆ పాత్రలోని నిజమైన భయాన్ని లేదా క్రూరత్వాన్ని అనుభవించలేడు” అని చెప్పారట. అందుకే ఆ పాత్రకు కొత్త వ్యక్తి అయిన విశ్వనాథ్‌ను ఎంపిక చేశారు. ప్రజంట్ ఈ విషయం హైలెట్ అవుతుంది.

Exit mobile version