Site icon NTV Telugu

టికెట్ రేట్ల తగ్గింపుతో పవన్ కు ఫరక్ పడదు : ఆర్జీవీ

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ చేసే ప్రతీ కామెంట్ కాంట్రవర్సీ అవుతుంది. ఎన్ని విమర్శలు ఎదురైనా తన మనసులోని మాటను బయట పెట్టడానికి ఏమాత్రం వెనుకాడని వర్మ ఏం చేసినా సంచలనమే. అయితే తాజాగా ఆయన ఎన్టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో సినిమాల గురించి, సినిమా టికెట్ రేట్ల వివాదం, పవన్ గురించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సినిమా టికెట్ రేట్ల విషయంపై ఇండస్ట్రీ తరపున సీఎంతో చర్చించడానికి వెళ్తారా ? అంటే నేను ఒక గ్రూప్ తో పర్టిక్యులర్ సమస్యపై ఎప్పుడూ మాట్లాడను. నేను అందులో భాగం అవ్వాలని అనుకోట్లేదు. ఎలాంటి పరిస్థితి అయినా నాకు ఓకే అంటూ చెప్పుకొచ్చారు.

Read Also : సమంత న్యూఇయర్ సెలబ్రేషన్ ప్లాన్ ఇదేనట !

సాధారణ ప్రేక్షకుడిగా సినిమా టికెట్ రేట్ల తగ్గింపుపై మీరు ఏమంటారు ? అన్న ప్రశ్నకు… ‘మాములుగా ఉండే దానికన్నా తక్కువ ధరకు వచ్చేది ఏదైనా సామాన్యుడికి ఎప్పుడూ ఆనందంగానే ఉంటుంది. కానీ లాజికల్ గా ఒక వస్తువును చేసిన వ్యక్తి ఎంత ప్రైజ్ పెడతాడు అనేది ఆ వ్యక్తి ఇష్టమై ఉండాలి. కొనుగోలుదారులు కొంటారా ? లేదా ? అనేది వాళ్ళ ఇష్టం’ అని అన్నారు.

పవన్ కళ్యాణ్ ను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఈ డెసిషన్ ను తీసుకుందని అంటున్నారు. ఇది నిజమే అయితే ఎంతవరకు కరెక్ట్ అంటారు? అని అడగ్గా… ముందుగా నేను దాన్ని నమ్మను. ఎందుకంటే దీనివల్ల పవన్ కళ్యాణ్ స్టార్ డమ్ లేదా అతనికి వచ్చే డబ్బులు ఏమాత్రం తగ్గవు’ అంటూ చెప్పుకొచ్చారు వర్మ.

Full Interview :

https://www.youtube.com/watch?v=_QUwgSLfgbI
Exit mobile version