Site icon NTV Telugu

Mirai : బాహుబలి తర్వాత మిరాయ్ సినిమానే.. ఆర్జీవీ సంచలనం..

Rgv (2)

Rgv (2)

Mirai : తేజసజ్జా హీరోగా వచ్చిన మిరాయ్ మూవీ ఫస్ట్ షో నుంచే పాజిటివ్ టాక్ సంపాదించుకుంది. భారీ అంచనాలతో వచ్చిన ఈ మూవీ.. అందుకు తగ్గట్టే అన్ని చోట్లా హిట్ టాక్ సొంతం చేసుకుంది. మంచు మనోజ్ విలనిజం కూడా అదిరిపోయింది. అయితే ఈ సినిమాపై చాలా మంది సెలబ్రిటీలు స్పందిస్తున్నారు. తాజాగా ఆర్జీవీ కూడా ఈ సినిమాపై ట్వీట్ చేశారు. మనకు తెలిసిందే కదా.. ఆర్జీవీ మంచి సినిమాలపై మొహమాటం లేకుండానే స్పందిస్తూ ఉంటాడు. ఇప్పుడు ఈ మూవీపై కూడా అలాగే స్పందించాడు. ఆయన మాట్లాడుతూ.. మిరాయ్ సినిమాతో తేజ సజ్జాకు భారీ హిట్ పడింది అంటూ రాసుకొచ్చాడు.

Read Also : Mirai : ప్చ్.. మిరాయ్ లో ఇద్దరు హీరోయిన్ల సాంగ్స్ లేపేశారు..

ఈ సినిమాతో తేజసజ్జా, కార్తీక్ ఘట్టమనేని, విశ్వ ప్రసాద్ కు బిగ్ హిట్ ఖాయం. బాహుబలి తర్వాత ఆ స్థాయిలో యునానిమస్ హిట్ టాక్ వచ్చింది మిరాయ్ మూవీకే. ఇది విజువల్ ఫీస్ట్. వీఎఫ్ ఎక్స్, నరేటివ్ హాలీవుడ్ స్థాయిలో ఉన్నాయి అంటూ రాసుకొచ్చాడు ఆర్జీవీ. ఆయన ట్వీట్ క్షణాల్లోనే వైరల్ అయిపోతోంది. మిరాయ్ సినిమా వీఎఫ్ ఎక్స్ పైనే ఇప్పుడు చర్చ జరుగుతోంది. ఇతిహాసాలను బేస్ చేసుకుని.. దానికి వీఎఫ్ ఎక్స్ ను జోడిస్తే ఎలా ఉంటుందో గతంలో హనుమాన్ సినిమాతోనే చూశాం. ఇప్పుడు మిరాయ్ మూవీతో అది పీక్స్ కు వెళ్లిపోయిందనే చెప్పుకోవాలి. పురాణాల ఆధారంగా తేజ చేస్తున్న మూవీలు ఆయనకు భారీ మార్కెట్ ను తెచ్చిపెడుతున్నాయి.

Read Also : Rashmika : విజయ్ తో ఎంగేజ్ మెంట్.. తానే అందరికీ చెప్తానన్న రష్మిక..

Exit mobile version