Site icon NTV Telugu

RGV: ఒకే ఒక్క ప్రశ్నతో బాలీవుడ్ ను ఏకిపారేసిన వర్మ

Ram Gopal Varma

Ram Gopal Varma

వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఆయన మనసుకు ఏది మాట్లాడాలనిపిస్తే అది మాట్లాడేస్తాడు.. ఏది తప్పు అనిపిస్తే దాన్ని ట్వీట్ చేసేస్తాడు. కొన్నిసార్లు వివాదాలు సృష్టిస్తాడు.. ఇంకొన్ని సార్లు ఆ వివాదాలకు ఆజ్యం పోస్తాడు. ఇక నిత్యం సోషల్ మీడియా లో ఏదో ఒకటి మాట్లాడుతూ ఉండే వర్మ తాజాగా బాలీవుడ్ పై విరుచుకుపడ్డాడు. ఒకే ఒక్క ప్రశ్నను బాలీవుడ్ కు సూటిగా సంధించి వారికి చుక్కలు కనిపించేలా చేశాడు. ఒకప్పుడు బాలీవుడ్ అంటే వేరు.. ఇప్పుడు బాలీవుడ్ వేరు. ప్రస్తుతం సౌత్ సినిమాలు హిందీలోనే ఎక్కువగా హిట్ అవుతున్నాయి..  ఇక ఈ విషయం గురించి వర్మ ట్వీట్ చేశాడు.

బాలీవుడ్ లో బిగ్గెస్ట్ ఓపెనర్ సినిమాల జాబితాను షేర్ చేస్తూ ” హిందీ సినిమా చరిత్రలో ఒక కన్నడ డబ్బింగ్ చిత్రం కెజిఎఫ్ 2, తెలుగు డబ్బింగ్ చిత్రం బాహుబలి 2  ఇంత పెద్ద ఓపెనర్‌గా నిలిచాయనే దాని గురించి హిందీ చిత్ర పరిశ్రమ (అకా బాలీవుడ్) ఏం ఆలోచిస్తుందని మీరు అనుకుంటున్నారు” అని ప్రశ్నించాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది. ఇక ఈ ట్వీట్ పై నెటిజన్స్ తమదైన రీతిలో స్పందిస్తున్నారు. ఒకే ఒక్క ప్రశ్నతో బాలీవుడ్ ను ఏకిపారేశాడు వర్మ అని కొందరు, సౌత్ సినిమా రేంజ్ మారిందని, ఇకముందు బాలీవుడ్ ను ఏలేది సౌత్ సినిమాలే అని మరికొందరు కామెంట్స్ పెడుతున్నారు. 

Exit mobile version