ఈరోజు మెగా పవర్ స్టార్ పుట్టినరోజు సందర్భంగా ఆయన తనయుడు బర్త్ డే విషెస్ తెలియజేస్తూ ఓ స్పెషల్ వీడియో ను పంచుకున్నాడు. “జీవితంలో మర్చిపోలేని క్షణాలు, నేను అప్పా అని పిలుస్తాను! నా ఆచార్య… పుట్టినరోజు శుభాకాంక్షలు!” అని చరణ్ ట్వీట్ చేశాడు. ఈ వీడియోలో తన తండ్రితో కలిసి పని చేయడం చాలా సంతోషంగా ఉందని చెప్పాడు. ఒక్క వీడియోతో తన తండ్రిపై ప్రేమ, ఆప్యాయతను తెలియజేశాడు చరణ్. మెగా తండ్రీ కొడుకులు ఇద్దరూ చాలా సన్నిహితంగా స్నేహితుల్లా ఉంటారన్న విషయం తెలిసిందే. వీరిద్దరికీ సంబంధించిన ఫోటోలు అప్పుడప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడతాయి.
Read Also : “చిరు 155” టైటిల్ రివీల్ చేసిన మహేష్
ఇక వీడియో విషయానికొస్తే చిత్రీకరణ ఆఖరి దశలో ఉన్న “ఆచార్య” మేకింగ్‌పై స్నీక్ పీక్ ఇచ్చారు. నల్లమల్ల అటవీప్రాంతంలో ‘ఆచార్య’ కీలక షెడ్యూల్ జరిగింది. 2 పాటలు, చిన్న టాకీ భాగం మినహా “ఆచార్య” షూటింగ్ పూర్తయింది. కొరటాల శివ బృందం సినిమా తుది కాపీని సిద్ధం చేయడానికి సన్నద్ధమవుతోంది. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ మరియు మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్ సంయుక్తంగా ఆచార్యను నిర్మిస్తున్నాయి. ఆచార్య విడుదల తేదీపై ఎలాంటి స్పష్టత రాలేదు. ఇక నేడు మెగాస్టార్ 66వ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.
