Peddi : రామ్ చరణ్ ను ఓ బ్యాడ్ సెంటిమెంట్ వెంటాడుతోంది. అదే ట్రైన్ ట్రాక్ ఎపిసోడ్. ఆ విషయంలో ఫ్యాన్స్ ఎప్పటి నుంచో నిరుత్సాహంలో ఉన్నారు. గతంలో బోయపాటి శ్రీను డైరెక్షన్ లో వచ్చిన వినయ విదేయ రామ్ సినిమాలో ట్రైన్ ట్రాక్ మీద ఓ సీన్ ఉంటుంది. అది సినిమాకే హైలెట్ అనేలా ఉంటుంది. కానీ మూవీ మాత్రం ప్లాప్ అయింది. ఇక ఎన్నో అంచయనాలతో ఈ ఏడాది సంక్రాంతికి రిలీజ్ అయిన గేమ్ ఛేంజర్ కూడా అంతే. డిజాస్టర్ అయింది. గేమ్ ఛేంజర్ లో ట్రైన్ ట్రాక్ సీన్ బాగా హైలెట్ చేశారు. హెలికాప్టర్ మీద రామ్ చరణ్ వచ్చి కత్తితో చేసే యాక్షన్ గూస్ బంప్స్ అన్నట్టు ప్రచారం చేశారు.
Read Also : Pawan Kalyan : కన్నడలో ఓజీకి ఇబ్బందులపై స్పందించిన పవన్
కానీ మూవీ ప్లాప్ అయింది. ఇప్పుడు రామ్ చరణ్ బుచ్చిబాబు డైరెక్షన్ లో చేస్తున్న పెద్ది సినిమా విషయంలో ఫ్యాన్స్ కు ఇదే టెన్షన్ పట్టుకుంది. ఎందుకంటే మొన్న రామ్ చరణ్ 18 ఏళ్ల కెరీర్ పూర్తి చేసుకున్న సందర్భంగా పెద్ది నుంచి రైల్వే ట్రాక్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఇందులో రైల్వే ట్రాక్ మీద చరణ్ నిలబడ్డ ఫోజు మామూలుగా లేదు. అయితే ఈ రైల్వే ట్రాక్ ఉన్న సినిమాలన్నీ ప్లాప్ అవుతున్నాయనే భయం ఫ్యాన్స్ లో ఉంది. కానీ పెద్ది సినిమాతో దాన్ని బ్రేక్ చేస్తాడని నమ్ముతున్నారు అభిమానులు. మరి ఏం జరుగుతుంది అనేది సమ్మర్ లో తేలిపోతుంది.
Read Also : Kantara 1 : బాయ్ కాట్ కాంతార1 అంటున్న తెలుగు యూత్.. ఎవరూ పట్టించుకోరా
