NTV Telugu Site icon

The India House: రామ్ చరణ్ సినిమాలో నటించాలని ఉందా ? ఇలా ట్రై చేసి చూడండి!

Casting Call

Casting Call

Ram Charan’s The India House Casting Call: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఒక పక్క సినిమాల్లో నటిస్తూనే మరోపక్క నిర్మాతగా కూడా సత్తా చాటుతూ వస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇప్పటికే కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ నడుపుతున్న ఆయన తన స్నేహితుడు విక్రమ్ తో కలిసి V మెగా పిక్చర్స్ అనే బ్యానర్ ని స్థాపించారు. ఇక ఆ బ్యానర్ లో మొదటి సినిమాని టాలీవుడ్ యంగ్ సెన్సేషన్ నిఖిల్ తో ప్లాన్ చేసి అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్ తో కలిసి పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా నిర్మిస్తున్నారు. ఈ మూవీ అనౌన్స్‌మెంట్ చేస్తూ రిలీజ్ చేసిన కాన్సెప్ట్ వీడియో మంచి అంచనాలు క్రియేట్ కూడా చేసింది. ‘ఇండియన్ హౌస్’ పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమా నుంచి ఆసక్తికరమైన ప్రకటన వచ్చింది. బ్రిటిష్ రూలింగ్ సమయంలో ఇండియన్ ఫ్రీడమ్ ఫైటర్స్ కొంతమంది.. బ్రిటిష్ గడ్డ పై ఏర్పాటు చేసిన గూఢచారి సమావేశం గృహమే ఈ ‘ఇండియన్ హౌస్’.

Srisailam: శ్రీశైలంలో ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 15 వరకు శ్రావణ మాసోత్సవాలు

ఇక ఇప్పుడు రామ్ చరణ్ V మెగా పిక్చర్స్ బ్యానర్ పెట్టి కొత్త టాలెంట్ ని ప్రోత్సహించి ఇండస్ట్రీకి వద్దామనుకుంటున్న కొత్తవారికి తాను అవకాశం కలిపిద్దాం అని ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ సినిమా యూనిట్ ఈ సినిమా కోసం కొత్త నటీనటులు కావాలంటూ ఒక ఆడిషన్ నోటీసు రిలీజ్ చేశారు. 10 ఏళ్ళ వయసు నుంచి 60 ఏళ్ల వయసు వరకు ఉన్న నటీనటులు కావాలని, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు 3 ఫోటోలు మరియు ఒక నిమిషం పాటు నటించిన వీడియో casting@agarwalarts.com కి పంపించాలని ప్రకటించారు. నిమిషం వీడియో అంటే రీల్స్ కాకుండా తమ టాలెంట్ చూపించేలా ఉండాలని నోట్ కూడా పెట్టారు, మరి మీకు నటన మీద ఏమాత్రం ఇంట్రెస్ట్ ఉన్నా మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి.