NTV Telugu Site icon

RC 16: ప్రశాంత్ నీల్ శిష్యుడితో రామ్ చరణ్ సినిమా…

Ram Charan

Ram Charan

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ప్రస్తుతం క్రియేటివ్ డైరెక్టర్ శంకర్ తో ఒక సినిమా చేస్తున్నాడు. ‘RC 15’ అనే వర్కింగ్ టైటిల్ తో రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ తర్వాత చరణ్, గౌతం తిన్నునూరితో ఒక సినిమా చెయ్యాల్సి ఉంది. యువీ క్రియేషన్స్ ప్రొడ్యూస్ చెయ్యాల్సిన ఈ ప్రాజెక్ట్ అనివార్య కారణాల వల్ల అటకెక్కింది. ఇప్పుడు చరణ్ నెక్స్ట్ సినిమా ఎవరితో చేస్తున్నాడు అనే క్యురియాసిటి అందరిలోనూ ఉంది. అయితే చరణ్, తన నెక్స్ట్ సినిమా కన్నడ దర్శకుడు ‘నర్తన్’తో చేయనున్నాడనే వార్త వినిపిస్తోంది. KGF సిరీస్ తో కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీ రేంజ్ పెంచిన ప్రశాంత్ నీల్ శిష్యుడే ‘నర్తన్’. ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ఫస్ట్ మూవీ ‘ఉగ్రం’కి నర్తన్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో వర్క్ చేశాడు. ఆ తర్వాత ప్రశాంత్ నీల్ నుంచి పక్కకి వచ్చి ‘ఉగ్రం’ హీరో అయిన శ్రీ మురళి మరియు కన్నడ సూపర్ స్టార్ ‘శివ రాజ్ కుమార్’ లని పెట్టి ‘మఫ్టీ’ అనే సినిమా చేశాడు.

కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీ బిగ్గెస్ట్ హిట్స్ లో ఒకటిగా నిలిచిన ‘మఫ్టీ’ సినిమా తర్వాత నర్తన్, శివన్నతోనే ‘భైరతి రణగలు’ అనే సినిమా చేయాల్సి ఉంది. ఈ ప్రాజెక్ట్ గురించి కన్నడ సినీ అభిమానులంతా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఇలాంటి సమయంలో నర్తన్, చరణ్ తో సినిమా చెయ్యడానికి కథని రెడీ చేస్తున్నాడనే వార్త బయటకి వచ్చింది. KGF హీరో యష్ తో కూడా నర్తన్ ఒక సినిమా చేయ్యనున్నాడనే రూమర్ వినిపిస్తోంది. ప్రశాంత్ నీల్ దగ్గర పని చేశాడు, పైగా మొదటి సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు కాబట్టే నర్తన్ నెక్స్ట్ సినిమా కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయ్యింది. మరి ఇంతకీ నార్తన్ అసలు యష్ తో సినిమా చేస్తాడా? శివన్నతో ఇప్పటికే కమిట్ అయిన ‘భైరతి రణగలు’ సినిమాని మొదలుపెడతాడా లేక తన గురువు ప్రశాంత్ నీల్ బాటలో నడుస్తూ టాలీవుడ్ హీరో అయిన రామ్ చరణ్ తో పాన్ ఇండియా సినిమా చేస్తాడా అనేది తెలియాలి అంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.