‘RRR’ సినిమా తర్వాత రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ మధ్య ఉన్న అనుబంధం కేవలం వృత్తిపరమైనదే కాదు, అంతకు మించి అని అందరికీ అర్థమైంది, ఇక తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఎన్టీఆర్ డ్రైవింగ్ స్కిల్స్ గురించి, అలాగే తన వ్యక్తిగత జీవనశైలి గురించి చరణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జూనియర్ ఎన్టీఆర్ గురించి మాట్లాడుతూ చరణ్ ఒక ఫన్నీ విషయాన్ని పంచుకున్నారు, “తారక్ చాలా క్రేజీ డ్రైవర్, అసలు అతను డ్రైవ్ చేస్తుంటే పిచ్చెక్కిపోతుంది” అంటూ నవ్వేశారు. తారక్ పక్కన కూర్చుని ప్రయాణించిన తన స్నేహితులు కూడా చాలా వింతైన, భయంకరమైన అనుభవాలను తనతో చెప్పారని సరదాగా గుర్తు చేసుకున్న చరణ్ మామూలుగానే ఎన్టీఆర్ దేనికైనా చాలా ఎనర్జిటిక్‌గా ఉంటారు, మరి ఆ ఎనర్జీ డ్రైవింగ్‌లో చూపిస్తే పక్కన ఉన్న వారికి చెమటలు పట్టడం ఖాయమని చరణ్ మాటలను బట్టి అర్థమవుతోంది.
Also Read :Rukmini Vasanth: ఆ నటుడితో ప్రేమలో రుక్మిణి వసంత్.. ఫొటో లీక్?
ఇక తన కెరీర్, వ్యక్తిగత జీవితం మధ్య ఉన్న సమతుల్యత గురించి చరణ్ చాలా పరిణతితో మాట్లాడారు, “ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు నా పనిని చాలా నిబద్ధతతో, దైవచింతనతో చేస్తాను.”, “ఆరు దాటిన తర్వాత నేను ఏం చేస్తానో, నా వృత్తి ఏంటో కూడా మర్చిపోతాను. పనిని ఇంటికి తీసుకురావడం నాకు ఇష్టం ఉండదు.”, “నన్ను నేను ఎప్పుడూ చాలా సీరియస్‌గా తీసుకోను. నా సక్సెస్‌ను కూడా తలకెక్కించుకోను” అని చరణ్ స్పష్టం చేశారు. గ్లోబల్ స్థాయిలో గుర్తింపు వచ్చినా, ‘ఆర్ఆర్ఆర్’ వంటి భారీ హిట్ తర్వాత కూడా రామ్ చరణ్ ఇంత సింప్లిసిటీతో ఉండటం అభిమానులను ఆకట్టుకుంటోంది.
