Site icon NTV Telugu

RC15 : రామ్ చరణ్ ఫ్యాన్స్ కు డబుల్ ధమాకా

Rc15

Rc15

విజనరీ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నెక్స్ట్ మూవీ ‘RC15’. రామ్ చరణ్, కియారా అద్వానీ, సునీల్, అంజలి, నవీన్ చంద్ర, జయరామ్ తదితరులు ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని టాలీవుడ్ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తుండగా, ఎస్ఎస్ తమన్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఇంటెన్స్ యాక్షన్-పొలిటికల్ డ్రామాగా తెరకెక్కుతున్న రామ్ చరణ్‌తో కియారా రొమాన్స్ చేయనుంది. ఈ సినిమాలో రామ్ చరణ్ ఎనర్జిటిక్ పాత్రలో కనిపించనున్నాడు. అయితే తాజాగా ఈ సినిమాలో చరణ్ తన డ్యూయల్ లుక్ తో డబుల్ ధమాకా ఇవ్వబోతున్నాడనే టాక్ నడుస్తోంది. రెండు విభిన్నమైన లుక్స్ లో.. క్లీన్ షేవ్ తో మిస్టర్ పర్ఫెక్ట్ లా, ఇక లేలేత మీసాలు, గడ్డంతో మరో లుక్ లో ప్రేక్షకులను థ్రిల్ చేయబోతున్నాడట.

Read Also : FIR Controversy : విష్ణు విశాల్ కు షాక్… తెలంగాణాలో బ్యాన్ కు డిమాండ్

ఈ చిత్రం ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది. RC15 నిర్మాతలు ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పు గోదావరి జిల్లాలో ఒక షూట్‌ని షెడ్యూల్ చేసారు. సినిమా షూటింగ్ కోసం ఇప్పటికే చరణ్ ముంబై నుంచి హైదరాబాద్ చేరుకున్నాడు. ఇక ‘RC15’ 2023 పొంగల్ సందర్భంగా తెరపైకి రానుంది. కాబట్టి మేకర్స్ షూటింగ్‌ను శరవేగంగా పూర్తి చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. సంవత్సరం చివరి నాటికి టాకీ పార్ట్ పూర్తి చేయాలనీ భావిస్తున్నారు. మరోవైపు తారక్ తో కలిసి రామ్ చరణ్ నటించిన “ఆర్ఆర్ఆర్” విడుదలకు సిద్ధంగా ఉంది. జక్కన్న దర్శకత్వం వహించిన ‘ఆర్ఆర్ఆర్’ మార్చి 25న థియేటర్లలోకి రానుంది.

Exit mobile version