NTV Telugu Site icon

Allu Arjun: గుంపులో ఒకరిగా బన్నీకి చరణ్ విషెష్.. షాకింగ్ గా రిప్లై!

Ram Charan Allu Arjun

Ram Charan Allu Arjun

Ram Charan Wishes to Allu Arjun: 69వ జాతీయ చలనచిత్ర పురస్కారాల్లో తెలుగు సినీ పరిశ్రమ సత్తా చాటిందన్న సంగతి తెలిసిందే. 2021 ఏడాదికి ప్రకటించిన నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్‏లో తెలుగు సినిమాలకు పెద్ద ఎత్తున అవార్డులు లభించాయి. రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమాకి ఏకంగా ఆరు అవార్డ్స్ రాగా.. డైరెక్టర్ సుకుమార్, అల్లు అర్జున్ కాంబోలో వచ్చిన పుష్ప సినిమాకి కూడా రెండు అవార్డ్స్ వచ్చాయి. అయితే ఇవన్నీ ఒక ఎత్తు అయితే తెలుగు సినీ పరిశ్రమలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సరికొత్త రికార్డు క్రియేట్ చేసిట్ చెప్పాలి. ఎందుకంటే ఈ అవార్డులు ఇవ్వడం మొదలు పెట్టిన 69 ఏళ్లలో అవార్డు అందుకోబోతున్న మొదటి తెలుగు నటుడిగా నిలిచారు. ఇక బన్నీకి జాతీయ ఉత్తమ నటుడిగా రావడంతో మెగా ఫ్యామిలీ ఆనందంలో మునిగిపోయింది. చిరు సోషల్ మీడియా వేదికగా బన్నీకి స్పెషల్ విషెస్ తెలుపగా వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్ వంటి వారు బన్నీ ఇంటికి వెళ్లి మరీ శుభాకాంక్షలు తెలిపారు.

Nani: నేషనల్ అవార్డ్స్.. మనసు ముక్కలు అయ్యిందన్న నాని

అయితే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాస్త ఆలస్యంగా స్పందించడం చర్చనీయాంశం అయింది. శుక్రవారం తన ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ రామ్ చరణ్ ఆర్ఆర్ఆర్ సినిమా యూనిట్ తోపాటు.. పుష్ప, కొండపొలం, ఉప్పెన, అలియా భట్ లకు అభినందనలు తెలిపారు. “ఇది నేను ఎంతగానో గర్వించే క్షణాలు.. నా బంధుమిత్రులు, స్నేహితులు, సన్నిహితులే అవార్డులను గెలుచుకున్నారు, ఆర్ఆర్ఆర్ టీం, విజనరీ డైరెక్టర్ రాజమౌళి గారికి కంగ్రాట్స్. ఆరు అవార్డ్స్ వచ్చాయి. ఎంఎం కీరవాణి గారు.. ప్రేమ్ రక్షిత్, కాళభైరవ, శ్రీనివాస్ మోహన్, కింగ్ సోలోమన్, డీవీవీ ఎంటర్టైన్మెంట్, డీవీవీ దానయ్య గారు. ఇది నాకు ఎంతో మెమోరబుల్ జర్నీ” అంటూ చెప్పుకొచ్చాడు. ఇలా అందరిలో ఒకరిగా అల్లు అర్జున్ పేరు చేర్చారు. దానికి బన్నీ కూడా ముక్తసరిగానే థాంక్ యూ అని ట్వీట్ చేశారు. ఈ వ్యవహారం ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశం అవుతోంది.

Show comments