NTV Telugu Site icon

Ram Charan: చిరంజీవి నటజీవితానికి 45 ఏళ్ళు.. మెగా పవర్ స్టార్ ఎమోషనల్ పోస్ట్

Chiranjeevi

Chiranjeevi

Ram Charan Wishes Chiranjeevi on Completion of 45 years: జూనియర్ ఆర్టిస్ట్ గా ప్రస్థానం మొదలు పెట్టి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, విలన్ గా.. ఆ తర్వాత చిన్న హీరోగా.. సుప్రీం హీరోగా.. మెగాస్టార్ గా.. ఓ సినీ సామ్రాజ్యాన్ని స్థాపించిన వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి. సాధారణంగా కనిపించే ఓ అసాధారణ వ్యక్తిత్వం కలిగిన చిరంజీవి.. సినిమా రంగంలోకి వచ్చి 45 ఏళ్లు పూర్తి అయ్యాయి. మెగాస్టార్ చిరంజీవి ఈ రోజు (శుక్రవారం) తన జీవితంలో ఓ కీలక మైలు రాయిని దాటారు. ఆయన జీవితంలో అనడం కంటే.. ఆయన తన సినిమా జీవితంలో ఈ ఘట్టాన్ని పూర్తి చేసుకున్నారు అనవచ్చు. ఈ సందర్భంగా ఆయన మూవీ కెరీర్ ను గుర్తు చేసుకుంటూ సోషల్ మీడియా వేదికగా ఓ ఎమోషనల్ పోస్ట్ షేర్ చేశారు రామ్ చరణ్. సినిమాల్లో 45 ఏళ్ల మెగా జర్నీని పూర్తి చేసుకున్న సందర్భంగా మన ప్రియతమ మెగాస్టార్‌కి హృదయపూర్వక అభినందనలు.

Sai Pallavi: డైరెక్టర్ తో సాయి పల్లవి సీక్రెట్ పెళ్లి.. సాయి పల్లవి రియాక్షన్ ఇదే ..!

ఎంత అపురూపమైన ప్రయాణం కూడా. #PranamKhareedu తో ప్రారంభించి , మీ అబ్బురపరిచే పెర్ఫార్మెన్స్‌లతో ఇంకా బలంగా కొనసాగుతున్నారు, మీరు మీ ఆన్ స్క్రీన్ ప్రెజెన్స్, మీ ఆఫ్ స్క్రీన్ మానవతా కార్యక్రమాలతో మిలియన్ల మందికి స్ఫూర్తినిస్తూనే ఉన్నారు. క్రమశిక్షణ, కృషి, అంకితభావం, అన్నింటికంటే ముఖ్యంగా కరుణ విలువలను పెంపొందించినందుకు ధన్యవాదాలు నాన్న అని అంటూ ఆయన ఎమోషనల్ నోట్ రాసుకొచ్చారు. 1978 సెప్టెంబర్ 22న ప్రాణం ఖరీదు’ విడుదలైంది, ఆ సినిమాతోనే తన పేరు చిరంజీవిగా మారిందని చిరు చెబుతూ ఉంటారు. ఇక ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి హీరోగా రెండు సినిమాలు అనౌన్స్ చేశారు.. ఒక పక్క సుష్మిత నిర్మాణంలో ఆయన ఒక సినిమా చేయనుండగా మరోపక్క వశిష్ట డైరెక్షన్లో కూడా ఒక సినిమా చేయనున్నారు.

Show comments