NTV Telugu Site icon

Ram Charan: రామలక్ష్మికి చిట్టిబాబు బర్త్ డే విషెస్ భలే చెప్పాడే..

Chran

Chran

Ram Charan: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగాచెప్పాల్సిన అవసరం లేదు. అమ్మడికి ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందంటే.. ఈ మధ్యే ఒక అభిమాని ఆమెకు గుడి కూడా కట్టించాడు. ఇక ఈ ఏడాది శాకుంతలం సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సామ్ కు నిరాశే మిగిలింది. అయినా వాటిని పట్టించుకోకుండా విజయం వైపు అడుగులు వేస్తుంది. ఏ మాయ చేసావే చిత్రంతో తెలుగుతెరకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు. సాధారణంగా ఏ హీరోయిన్ ఇలాంటి కష్టాలను అనుభవించి ఉండదు. చై తో విడాకులు అయ్యినప్పటి నుంచి ఇప్పటివరకు సామ్ ను ట్రోల్ చేయడం మాత్రం మానలేదు. ఆ ట్రోల్స్ ను సైతం దైర్యంగా ఎదుర్కొని నిలబడగలిగింది. ఇక మయోసైటిస్ వ్యాధి బారిన పడి నిత్యం మెడికేషన్ తో బతుకుతున్నా ఆమె పెదాలపై చిరునవ్వు మాత్రం చేరగలేదు. స్ట్రాంగెస్ట్ విమెన్ గా జీవితంతో పోరాడుతున్న సామ్ పుట్టినరోజు ఈరోజు. నేడు ఆమె తన 36 వ పుట్టినరోజును జరుపుకుంటుంది. ఇక దీంతో ఉదయం నుంచి సామ్ బర్త్ డే విషెస్ తో ట్విట్టర్ మారుమ్రోగుతోంది.

Brahmaji: కుక్కపిల్లలా ఉండాలి మా ఆవిడ దగ్గర.. గొడవైతే ఏం చేస్తానంటే..?

అభిమానులతో పాటు సినీ ప్రముఖులు కూడా సామ్ కు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. తాజాగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, సమంతకు స్పెషల్ గా బర్త్ డే విషెస్ తెలిపాడు. చరణ్ కు, ఉపాసనకు సామ్ మంచి ఫ్రెండ్. ఇక సామ్, చరణ్ .. రంగస్థలం వంటి హిట్ సినిమాలో నటించారు. చిట్టిబాబు, రామలక్ష్మి పాత్రల్లో వారు నటించారు అని చెప్పడం కన్నా జీవించారు అని చెప్పొచ్చు. ఇక తన నటన గురించి తెలిసిన చరణ్.. ఆ విషయాన్నీ కూడా ప్రస్తావిస్తూ ఆమెకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపాడు. ” ప్రియమైన సమంత.. నీ అద్భుతమైన పని గురించి తెలిసి నాకెంతో గర్వంగా ఉంది.. నీకు మంచి ఆరోగ్యం, సక్సెస్ అందాలని కోరుకుంటున్నాను. హ్యాపీ బర్త్ డే మరియు సిటాడెల్ కు గుడ్ లక్” అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది.

Show comments