Ram Charan: మెగా పవర్ స్టార్ కి ఇంటర్నేషనల్ అవార్డ్…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ క్రేజ్ గ్లోబల్ రేంజ్‌కి వెళ్లిపోయింది. నాటు నాటు సాంగ్‌కి ఆస్కార్ రావడంతో తారక్, చరణ్ పేర్లు ప్రపంచ వ్యాప్తంగా మార్మోగిపోయాయి. స్టీవెన్ స్పీల్ బర్గ్, జేమ్స్ కామెరాన్ లాంటి హాలీవుడ్ దిగ్గజ దర్శకులు సైతం వీళ్ల యాక్టింగ్‌కు ఫిదా అయిపోయారు. అందుకే ఇద్దరికీ ఎన్నో అవార్డ్స్ వరించాయి. తాజాగా రామ్ చరణ్ ఖాతాలో మరో ఇంటర్నేషనల్ అవార్డ్ వచ్చి చేరింది. అమెరికాలో నిర్వహించే పాప్ గోల్డెన్ అవార్డ్స్… ఇండియాలోని బాలీవుడ్ యాక్టర్స్ అండ్ సినిమాలకు కూడా ఇస్తుంటారు. ఇప్పటకే ఈ అవార్డ్స్ నామినేషన్స్‌లో… రామ్ చరణ్, షారుఖ్ ఖాన్, అదా శర్మ, దీపికా పదుకొనే, రాశి ఖన్నా వంటి వారు చోటు దక్కించుకున్నారు. తాజాగా పాప్ గోల్డెన్ అవార్డ్స్ ప్రకటించారు. ఈ విషయాన్ని పాప్ గోల్డెన్ కమిటీ అధికారికంగా వెల్లడించింది.
తెలుగు నుంచి రామ్ చరణ్‌కు పాప్ గోల్డెన్ బాలీవుడ్ యాక్టర్ అవార్డు దక్కింది. దీంతో మెగా పవర్ స్టార్ పేరు సోషల్ మీడియా టాప్ ట్రెండ్ అవుతోంది. ఇటీవల ఇచ్చిన నేషనల్ అవార్డ్స్‌లో చరణ్‌కు బెస్ట్ యాక్టర్ అవార్డ్ వస్తుందని మెగా ఫ్యాన్స్ భావించారు కానీ చరణ్, ఎన్టీఆర్‌ని కాదని అల్లు అర్జున్ బెస్ట్ యాక్టర్ అవార్డ్ సొంతం చేసుకున్నాడు. అయితే ఇప్పుడు… నేషనల్ అవార్డు మిస్ అయినా ఇంటర్నేషనల్ అవార్డు రావడంతో మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. మరోవైపు నెట్ ఫ్లిక్స్ సీఇవో టెడ్ సరండోస్, రామ్ చరణ్‌ను కలవడం హాట్ టాపిక్‌గా మారింది కానీ గేమ్ చేంజర్ అప్డేట్ విషయంలోనే మెగా ఫ్యాన్స్ కాస్త అప్సెట్ అవుతున్నారు. ఇప్పటికైనా గేమ్ చేంజర్ అప్డేట్ ఇవ్వాలంటూ… కామెంట్స్ చేస్తున్నారు. మరి గేమ్ చేంజర్‌తో చరణ్ ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తాడో చూడాలి.
Also Read
- AAA Cinemas Vizag: ఈసారి పుష్పరాజ్‌ని కలవడం కష్టమే.. వైజాగ్ AAA ఓపెనింగ్‌కు ఫ్యాన్స్‌కు నో ఎంట్రీ!
- Shahid Kapoor: అల్లు అర్జున్ ఫ్యాన్స్‌కు క్రేజీ న్యూస్! AA23లో ఆ బాలీవుడ్ హీరో ఎంట్రీ?
- Arun Matheswaran: స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్‌ను హీరోగా ఎలా ఒప్పించాడో చెప్పిన డీసీ డైరెక్టర్!
- Varun Tej: ఆ హీరోయిన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నాడో చెప్పిన వరుణ్ తేజ్!
#POPGOLDENAWARDS2023 GOLDEN BOLLYWOOD ACTOR OF THE YEAR AWARD WINNER REVEALED!!
CONGRATULATIONS TO #RAMCHARAN For the well deserved honor!! pic.twitter.com/nzfZG1BxDS
— POP GOLDEN AWARDS (@popgoldenawards) December 8, 2023
తాజావార్తలు
-
Tour Of South Africa: సౌతాఫ్రికా షెడ్యూల్లో కీలక మార్పులు.. టీ20లు కూడా అక్కడే..
-
Mohan Bhagwat: రిజర్వేషన్లు కొనసాగాలి, వారు వదులుకోవాలి: ఆర్ఎస్ఎస్ చీఫ్ కీలక వ్యాఖ్యలు
-
OTR: జాగ్రత్త.. మీరు, మీ భర్త జాగ్రత్తగా మెలగండి..
-
Jobs In Hydraa: హైడ్రాలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. ఆగస్టు 8, 9 తేదీల్లో నేరుగా ఎంపిక ప్రక్రియ..
-
Pakistan: పిల్లలపై అత్యాచారం, ట్రాఫికింగ్ నిందితుడు.. PoK ఎన్నికల్లో గెలుపు..
ట్రెండింగ్
-
రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!
-
6.99 అంగుళాల 120Hz OLED డిస్ప్లే, 8,000mAh బ్యాటరీతో REDMI Note 17 5G లాంచ్..!
-
Crispy Wheat Flour Snacks: బయటి జంక్ ఫుడ్‌కి బై..బై.. ఇంట్లోనే గోధుమపిండితో కరకరలాడే హెల్తీ స్నాక్స్ చేసేయండి ఇలా.!
-
Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్‌లు ఇదిగో..!
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!