ఎట్టకేలకు మెగాస్టార్ చిరంజీవి కుటుంబమంతా ఆనందంలో మునిగిపోయింది. వాస్తవానికి మెగాస్టార్ చిరంజీవి కుమారుడు రామ్ చరణ్ తేజ, ఉపాసన దంపతులకు ఇప్పటికే ఒక కుమార్తె జన్మించారు. అయితే మెగాస్టార్ చిరంజీవి ఇద్దరు కుమార్తెలకు ఇద్దరు కుమార్తెలు చొప్పున నలుగురు కుమార్తెలు, రామ్ చరణ్ కుమార్తెతో కలిపి మొత్తం ఐదు మంది మనవరాళ్ళు. వీరందరిని చూస్తుంటే ఏదో లేడీస్ హాస్టల్‌లో ఉంటున్న ఫీలింగ్ కలుగుతుందని, ఒక మనవడిని ఇవ్వాలని గతంలో రామ్ చరణ్‌ను
మెగాస్టార్ చిరంజీవి కోరినట్లుగా స్వయంగా ఒక సినిమా ఫంక్షన్‌లో చెప్పుకొచ్చారు.
Also Read:Vijay-Rashmika :రేపే ‘విజయ్ – రష్మిక’ వివాహం? ఉదయ్‌పూర్‌లో పెళ్లి ఏర్పాట్లు.. వీడియో వైరల్!
ఇప్పుడు ఎట్టకేలకు రామ్ చరణ్ తేజ తన తండ్రి చిరంజీవి కోర్కెను తీర్చేశారు. రామ్ చరణ్ తేజ, ఉపాసన దంపతులకు కవల పిల్లలు జన్మించారు. ఒక బాబు, ఒక పాప నిన్న జన్మించినట్లుగా నిన్న అర్ధరాత్రి పొద్దుపోయిన తర్వాత మెగాస్టార్ చిరంజీవి ప్రకటించారు. ఇదంతా ఒక ‘డివైన్ బ్లెస్సింగ్’ అని పేర్కొన్న ఆయన, తమ కుటుంబం అంతా ఆనందంతో ఉందని, తమ కోసం ప్రార్థించిన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు.
Also Read:Ambati Rambabu : మాజీ మంత్రి అంబటి రాంబాబు అరెస్ట్..
మొత్తం మీద మెగాస్టార్ చిరంజీవి లెగసీ కంటిన్యూ చేసే వారసుడు వచ్చేసాడు అంటూ మెగా అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే నాగబాబు కుమారుడు వరుణ్ తేజ్, లావణ్య దంపతులకు కూడా ఒక కుమారుడు జన్మించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు రామ్ చరణ్ దంపతులకు కూడా ఒక కుమారుడు, ఒక కుమార్తె జన్మించడంతో మెగా అభిమానులందరూ సంబరాల్లో మునిగి తేలుతున్నారు.
