Posani Krishna Murali: ఒక రోజుకు పోసాని కృష్ణమురళి తీసుకునే రెమునరేషన్ ఇదేనట!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Posani Krishna Murali: సినీ పరిశ్రమలో పారితోషికం విషయంలో స్టార్ నటీనటులు భారీ మొత్తాలు డిమాండ్ చేస్తున్న ఈ రోజుల్లో, సీనియర్ నటుడు పోసాని కృష్ణమురళి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చకు దారితీశాయి. ఎక్కువ పారితోషికం ఇచ్చేందుకు నిర్మాతలు ముందుకు వచ్చినప్పటికీ, తాను స్వయంగా తక్కువ మొత్తానికే సినిమాలు చేశానని ఆయన స్వయంగా వెల్లడించారు. ఇటీవల ఆయన ఎన్టీవీ పాడ్‌కాస్ట్‌లో పాల్గొని మాట్లాడుతూ.. ఒకసారి ఓ నిర్మాత రోజుకు రూ.2 లక్షలు పారితోషికంగా ఇస్తామని చెప్పారని, అయితే తనకు అంత మొత్తం అవసరం లేదని భావించి రూ.1 లక్ష చాలు అని చెప్పానన్నారు. ఆ సమయంలో నిర్మాత సుబ్రహ్మణ్యం ఎంతో మంచి వ్యక్తి అని, భవిష్యత్తులో మీ మార్కెట్ పెరిగితే అప్పుడే పారితోషికం పెంచుకుందామని సూచించారని గుర్తు చేసుకున్నారు.
అయితే, తనకు వచ్చిన అవకాశాలే గొప్పవని, వాటి కంటే డబ్బుకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వలేదని ఆయన చెప్పారు. పారితోషికం పెంచాలని ఎప్పుడూ నిర్మాతలపై ఒత్తిడి చేయలేదని, వారు ఎంత ఇస్తే అంతే సంతోషంగా స్వీకరించేవాడినని పేర్కొన్నారు. “నాకు సినిమాలు చేయడమే ఆనందం. డబ్బు కోసం ఎప్పుడూ సినిమాలు చేయలేదు. ఎక్కువ డిమాండ్ చేయడం నా స్వభావం కాదు. అవకాశాలు ఇచ్చిన ఇండస్ట్రీకి నేను ఎప్పుడూ రుణపడి ఉంటాను. నాకు వచ్చినంతలోనే సంతోషంగా జీవించాను” అని అన్నారు. ఇప్పటితో పోలిస్తే, గతంలో సినీ పరిశ్రమలో ఉన్న అనుబంధాలు, నిర్మాతలపై ఉన్న నమ్మకం, పారితోషికం కంటే పనిపై ఉన్న ప్రేమ ఎంతో భిన్నంగా ఉండేదని ఆయన వ్యాఖ్యల ద్వారా అర్థమవుతోంది. ప్రస్తుతం ఆయన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Also Read
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!