NTV Telugu Site icon

Ram Charan – Upasana: రామ్ చరణ్ కు భార్య అంటే ఎంత ప్రేమో.. ఫ్యాన్స్ ఫిదా..

Cherry (2)

Cherry (2)

ఎంత పెద్ద స్టార్ హీరో అయిన పెళ్లి అయ్యిన తర్వాత భార్య సేవకుడే.. భార్య భర్తకు సేవకురాలే.. ఇంటి పనులు చేయడం దగ్గర నుంచి, షాపింగ్ వెళ్తే బ్యాగులు మొయ్యడం వరకూ..ఈరోజుల్లో ఇద్దరు సమానమే.. ఒకరి గురించి ఒకరు పట్టించుకోవాలి.. ఒకరికి మరొకరు సాయంగా ఉండాలి.. ఇప్పుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పరిస్థితి కూడా సేమ్ అలానే ఉంది. తాజాగా ఆయన తన భార్య కాళ్లు నొక్కుతున్న వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది..

టాలీవుడ్ లో క్యూట్ కపుల్స్ గా ఈ జంట పేరు తెచ్చుకున్నారు.. 2012 జూన్ 14న ప్రేమ వివాహం చేసుకున్న ఈ మెగా జంట.. ఎంతో అన్యోన్యమైన జీవితాన్ని గడుపుతూ, ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నారు. అయితే వీరిద్దరూ శుక్రవారం అనంత్ అంబానీ ప్రీ-వెడ్డింగ్ వేడుకల కోసం స్పెషల్ ఫ్లైట్ లో గుజరాత్ వెళ్ళారు. ఈ సందర్భంగా విమానంలో నిద్ర పోతున్న తన భార్య కాళ్ళు నొక్కుతూ కనిపించారు.. పక్కన ఉన్న ఎవరో వీడియో తీసి పోస్ట్ చేశారు.. అదే ఇప్పుడు నెట్టింట ట్రెండ్ అవుతుంది..

ఇక సినిమాల విషయానికొస్తే.. RRR తో గ్లోబల్ వైడ్ గా పాపులారిటీ దక్కించుకున్న రామ్ చరణ్, దానికి తగ్గట్టుగానే కొత్త ప్రాజెక్ట్స్ సెట్ చేసుకుంటున్నారు. ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో ‘గేమ్ చేంజర్’ అనే పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ లో నటిస్తున్నారు. ఇందులో కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది. దీని తర్వాత బుచ్చిబాబు సానా డైరెక్షన్ లో RC 16 మూవీ చేయనున్నారు చెర్రీ. త్వరలోనే ఈ క్రేజీ ప్రాజెక్ట్ సెట్స్ మీదకు వెళ్లనుంది..

Show comments