Site icon NTV Telugu

Vikram: విశ్వనటుడు కోసం రంగంలోకి మెగా పవర్ స్టార్

Vikram

Vikram

విశ్వనటుడు కమల్ హాసన్ ప్రధాన పాత్రలో లోకేష్ కనగరాజన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘విక్రమ్’. కమల్ హాసన్ మరియు ఆర్ మహేంద్రన్ కలిసి రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్‌ నిర్మిస్తున్న ఈ చిత్రంలో మలయాళ స్టార్ హీరో ఫహిద్ ఫాజిల్, కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి కీలక పాత్రల్లో నటిస్తుండగా.. కోలీవుడ్ స్టార్ హీరో సూర్య క్యామియో పాత్రలో నటిస్తున్నాడు.   ఈ సినిమాపై  రోజురోజుకు అంచనాలను పెంచేస్తున్నారు మేకర్స్.. ఇప్పటికే ఈ సినిమ తెలుగు రైట్స్ హీరో నితిన్ సొంత బ్యానర్ శ్రేష్ట్ మూవీస్ దక్కించుకొని హాట్ టాపిక్ గా మారింది.

ఇక తాజాగా ఈ సినిమా తెలుగు ట్రైలర్ కోసం ఏకంగా మెగా పవర్ స్టార్ రామ్ చరణే రంగంలోకి దిగడం సంచలనం సృష్టిస్తోంది.  ‘విక్రమ్’ తెలుగు ట్రైలర్ ను మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఈరోజు సాయంత్రం 5 గంటలకు రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ తెలిపారు. ఇప్పటికే తమిళం, హిందీ భాషల్లో విడుదలైన ఈ సినిమా ట్రైలర్‌కి విశేష స్పందన వస్తోంది. మరి తెలుగు ట్రైలర్  ఏ లెవెల్లో ఉండబోతుందో చూడాలంటే మరికొన్ని గంటలు ఆగాల్సిందే.

Exit mobile version