NTV Telugu Site icon

RC 16: బుచ్చిబాబు మాస్టర్ ప్లాన్ ఆ రేంజులోనే…

Rc 16

Rc 16

ట్రిపుల్ ఆర్ సినిమాతో రామ్ చరణ్‌, ఎన్టీఆర్ బాక్సాఫీస్ లెక్కలు మారిపోయాయి. ఈ స్టార్ హీరోలు చేస్తున్న అప్ కమింగ్ ప్రాజెక్ట్స్‌ గ్లోబల్ టచ్‌తో రాబోతున్నాయి. ట్రిపుల్ ఆర్ సెట్స్ పై ఉండగానే.. స్టార్ డైరెక్టర్ శంకర్‌తో ఆర్సీ 15 ప్రాజెక్ట్‌ను లైన్లో పెట్టాడు చరణ్‌. ప్రస్తుతం ‘గేమ్ ఛేంజర్’ సెట్స్ పై ఉంది. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమా పై భారీ అంచనాలున్నాయి. ఈ సినిమాతో మెగా పవర్ స్టార్ క్రేజ్ నెక్స్ట్ లెవల్‌కి వెళ్లడం ఖాయం. ఇక ఈ సినిమా తర్వాత ఉప్పెన డైరెక్టర్ బుచ్చిబాబుతో సినిమా అనౌన్స్ చేశాడు చరణ్‌. ఈ ప్రాజెక్ట్ రంగస్థలం సినిమాకు మించి, గ్లోబల్ రేంజ్‌లో ఉంటుందని.. ఇప్పటికే చెప్పేశాడు రామ్ చరణ్. అందుకే బుచ్చిబాబు ట్రిపుల్ ఆర్ లెవల్లో ఆర్సీ 16 కోసం రంగం సిద్దం చేస్తున్నాడట. ట్రిపుల్ ఆర్ సినిమా కోసం వివిధ భాషలకు చెందిన యాక్టర్స్‌ను తీసుకున్నాడు రాజమౌళి. ముఖ్యంగా బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్, ఆలియా భట్.. కోలీవుడ్ నుంచి సముద్రఖని, శ్రియ శరన్.. ఇలా వివిధ ఇండస్ట్రీలకు చెందిన నటీనటులను తీసుకున్నాడు.

బడ్జట్ అండ్ కాస్టింగ్ స్కేల్ కి తగ్గట్టే.. ఆర్ ఆర్ ఆర్ సినిమా పాన్ ఇండియా బాక్సాఫీస్‌ని షేక్ చేసి.. హాలీవుడ్ రేంజ్‌లో గుర్తింపు తెచ్చుకొని.. ఏకంగా ఆస్కార్ కొట్టేసింది. అందుకే ఇప్పుడు బుచ్చిబాబు కూడా.. హిందీ, తమిళ, మలయాళ నటీనటులతో పాటు కొంతమంది మరాఠీ థియేటర్, టీవీ ఆర్టిస్టులను కూడా ఆర్సీ 16లో తీసుకుంటున్నారట. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ వర్క్ జెట్ స్పీడ్‌లో జరుగుతోంది. ప్రస్తుతం స్టార్ కాస్టింగ్ సెలక్షన్ జరుగుతున్నట్టు సమాచారం. త్వరలోనే ఆర్సీ 16 నటీనటులకు సంబంధించిన పూర్తి వివరాలను బయటికి రానున్నాయి. అన్నట్టు ఈ సినిమాలో హీరోయిన్‌గా జాన్వీ కపూర్ పేరు వినిపిస్తోంది. ప్రస్తుతం ఈ బ్యూటీ ఎన్టీఆర్ సరసన ‘దేవర’ మూవీలో నటిస్తోంది. త్వరలోనే ఇలాంటి విషయాల్లో క్లారిటీ రానుంది.