తెలుగులో నాని హీరోగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కిన ‘జెర్సీ’ చిత్రం హిందీలో అదే పేరుతో రీమేక్ అయింది. షాహిద్ కపూర్ హీరోగా రూపొందిన హిందీ ‘జెర్సీ’ ఇటీవలే విడుదలై విజయపథంలో పయనిస్తోంది. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ఓ చిత్రంలో నటించనున్నారు. ‘జెర్సీ’ హిందీ మూవీ సక్సెస్ ఫుల్ గా సాగుతున్న సమయంలో చెర్రీ తన డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరిని అభినందించారు. ‘జెర్సీ’ చిత్రంలో క్రికెట్ నేపథ్యంగా కనిపించినా, అందులో కేవలం మూడు ప్రధాన పాత్రల చుట్టూ కథ సాగుతుందని అది తనను కట్టి పడేసిందని చెర్రీ చెప్పారు. తండ్రి, తల్లీ, కొడుకు మధ్య సాగే ఫ్యామిలీ డ్రామా, సెంటిమెంట్స్, అందులో పండించిన ఎమోషన్స్ తనకు బాగా నచ్చాయని చెర్రీ తెలిపారు.
తాను గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో నటించబోయే చిత్రం ఏ క్రీడా నేపథ్యంలోనూ రూపొందబోదని రామ్ చరణ్ చెప్పారు. తనతో కూడా గౌతమ్ ఓ హార్ట్ టచింగ్ మూవీ తెరకెక్కిస్తారన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు చరణ్.
