మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన తండ్రి మెగాస్టార్ చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ (సిసిటి) వెబ్‌సైట్‌ను లాంచ్ కు ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ రోజు ఉదయం జరిగిన కార్యక్రమంలో ‘చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్’ వెబ్సైట్ లాంచ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ “నాన్న నట వారసత్వాన్నే కాదు సేవా తత్వాన్ని కూడా తీసుకుంటున్నాను. చిన్న చిన్న అడుగులతో నా సేవా కార్యక్రమాలను కొనసాగిస్తాను. మరో 30 ఏళ్ల పాటు నా ఆధ్వర్యంలో బ్లడ్ బ్యాంకు సేవలు కొనసాగుతాయి. రెండో దశలో బ్లడ్ బ్యాంకు కోసం ప్రత్యేక యాప్ తయారు చేయాలనే ఆలోచన ఉంది. మా సినిమా పారితోషకాలతో ఈ బ్లడ్ బ్యాంకు, ఐ బ్యాంకు కొనసాగుతుంది.
10 మందికి సహాయం అందుతుందంటే దాతల నుంచి విరాళాలు తీసుకుంటాం. ఈ వెబ్సైటు ద్వారా ఇకపై గంటల తరబడి లైన్ లో నిలబడాల్సిన అవసరం లేదు. ముందుగానే స్లాట్ బుక్ చేసుకుని, టైం కు వచ్చి పని చేసుకుని వెళ్లొచ్చు” అని అన్నారు.
Read Also : చిరంజీవి, మోహన్ బాబు ఫోన్ లో మాట్లాడుకున్నారు
ఇక చరణ్ ఆవిష్కరించిన చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ వెబ్ సైట్ 25 భాషల్లో వెబ్ సైట్ అందుబాటులో ఉంటుంది. దీనివల్ల దేశవ్యాప్తంగా మరిన్ని ప్రాంతాలకు చిరంజీవి బ్లడ్ బ్యాంక్ విస్తరణ జరుగుతుంది. స్లాట్ బుక్ చేసుకొని రక్తదానం చేయొచ్చు. చిరంజీవి సినిమా, రాజకీయ, వ్యక్తిగత విషయాలు… ఇలాంటివన్నీ ఈ వెబ్ సైట్ లో లభిస్తాయి. ఏం కావాలన్నా ఒక్క క్లిక్ తో అందుబాటులోకి వస్తుంది.
