టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ దిల్ రాజు మేనల్లుడు ఆశిష్ రెడ్డి హీరోగా నటిస్తున్న తొలి చిత్రం “రౌడీ బాయ్స్”. హర్ష కొనుగంటి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా జనవరి 14న విడుదలకు సిద్ధంగా ఉంది. అనుపమ పరమేశ్వరన్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాకు సంబంధించి నిన్న మ్యూజికల్ నైట్ అంటూ ఈవెంట్ ను నిర్వహించారు. దీనికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన రామ్ చరణ్ మాట్లాడుతూ ట్రైలర్ చూశానని, ఆశిష్ మొదటి సినిమాలోనే బాగా నటించాడని అన్నారు. అయితే వెనుక ఎంత బ్యాక్ గ్రౌండ్ ఉన్నా కూడా కష్టపడాలని ఆశిష్ కు సలహా ఇచ్చారు రామ్ చరణ్. ఇక తనేమో నటుడి ఫ్యామిలీ నుంచి వచ్చి నిర్మాతగా మారితే, ఆశిష్ నిర్మాత ఫ్యామిలీ నుంచి వచ్చి నటుడిగా మరుతున్నాడని అన్నారు. అంతేకాదు ప్రొడక్షన్ కన్నా యాక్టింగే బెటర్… అందులోనే కంటిన్యూ అవ్వమని ‘రౌడీ బాయ్’కి రామ్ చరణ్ సూచించారు. ఇక అనుపమలో ఓ ప్రత్యేకమైన చార్మ్ ఉంటుందని చెప్పుకొచ్చారు.
Read Also : నా సినిమాకే పోటీనా అన్నాడు ?… రామ్ చరణ్ వ్యక్తిత్వంపై స్టార్ డైరెక్టర్ కామెంట్స్
