నా సినిమాకే పోటీనా అన్నాడు ?… రామ్ చరణ్ వ్యక్తిత్వంపై స్టార్ డైరెక్టర్ కామెంట్స్

ప్రముఖ నిర్మాత దిల్ రాజు మేనల్లుడు ఆశిష్ రెడ్డి టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. ఆశిష్ రెడ్డి హీరోగా నటిస్తున్న “రౌడీ బాయ్స్” సినిమాకు హర్ష కొనుగంటి దర్శకత్వం వహించగా, ఈ మూవీ జనవరి 14న విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమాకు సంబంధించి నిన్న మ్యూజికల్ నైట్ అంటూ ఈవెంట్ ను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, స్టార్ డైరెక్టర్స్ అనిల్ రావిపూడి, వేణు శ్రీరామ్ లతో పాటు చిత్రబృందం మొత్తం హాజరయ్యింది. ఈ కార్యక్రమంలో అనిల్ రావిపూడి మాట్లాడుతూ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Read Also : టికెట్ ధరల ఇష్యూ… నాగ చైతన్య ఏమంటున్నాడంటే?

“అన్నీ బాగుండి ఉంటే ఈపాటికి థియేటర్లలో విజిల్స్ వేసేవాళ్ళం. నిజంగా చెప్పాలంటే మన టాలీవుడ్ హీరోలు బంగారం… మన రామ్ చరణ్ ఇంకా మంచి బంగారం. ఎందుకంటే వాళ్ళు రీల్ లైఫ్ లోనే కాదు రియల్ లైఫ్ లోనూ మంచి హీరోలే. ఏ కష్టం వచ్చినా ముందుంటారు మన హీరోలు. ఒక మంచి వ్యక్తిత్వం ఎప్పుడు వస్తుందంటే… బాగా నటిస్తేనే కాదు, మంచి వ్యక్తిత్వం ఉన్న మంచి హీరో అవుతారు. సందర్భం వచ్చింది కాబట్టి… వ్యక్తిత్వం అని వచ్చింది కాబట్టి చెప్తున్నా… రాజమౌళి కొడుకు పెళ్ళిలో చరణ్ ను మొదటిసారి కలిసాను. అనిల్ అని పరిచయం చేస్తే “ఎఫ్ 2″ డైరెక్టర్ కదా అన్నారు. ఆ తరువాత నా సినిమాకే పోటీనా ? అన్నారు. నాకు చెమటలు పట్టేశాయి. వెంటనే హగ్ చేసుకుని నీ సినిమా పెద్ద హిట్ కావాలని కోరుకున్నారు. అలా ఆయన ఇతరులకు రెస్పెక్ట్ ఇవ్వడం నచ్చింది” అంటూ చరణ్ కు ఆకాశానికెత్తేశారు. అనిల్ ఇంకా ఏం మాట్లాడారో ఈ వీడియోలో చూడండి.

Related Articles

Latest Articles