NTV Telugu Site icon

Ram Charan: ఆదికేశవ ట్రైలర్ కి చరణ్ సూపర్ రెస్పాన్స్…

Panja Vaishnav Tej

Panja Vaishnav Tej

మెగా మేనల్లుడు పంజా వైష్ణవ్ తేజ్ మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. లాస్ట్ రెండు సినిమాలతో కాస్త డిజప్పాయింట్ చేసిన వైష్ణవ్ తేజ్ కంప్లీట్ యాక్షన్ మోడ్ లోకి షిఫ్ట్ అయ్యి ‘ఆదికేశవ’ సినిమా చేస్తున్నాడు. సితార ఎంటర్టైన్మెంట్స్  బ్యానర్ పై తెరకెక్కిన ఈ మూవీని శ్రీకాంత్ రెడ్డి డైరెక్ట్ చేస్తున్నాడు. యంగ్ సెన్సేషన్ శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోన్న ఈ మూవీలో మలయాళ టాలెంటెడ్ యాక్టర్ జోజు జార్జ్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నాడు. తమిళ హీరోయిన్ అపర్ణ దాస్ మరో కీ రోల్ లో కనిపించనున్న ఈ సినిమాకి జీవీ ప్రకాష్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఇప్పటివరకు మేకర్స్ రిలీజ్ చేసిన ప్రమోషనల్ కంటెంట్ కి సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. లేటెస్ట్ గా బయటకి వచ్చిన ఆదికేశవ ట్రైలర్ మరింత మాస్ ఎలిమెంట్స్ తో కట్ చేయడంతో వ్యూస్ సూపర్బ్ గా వస్తున్నాయి.

ట్రైలర్ లో వైష్ణవ్ తేజ్ ‘రుద్ర కాళేశ్వర రెడ్డి’గా పవర్ ఫుల్ గా కనిపిస్తున్నాడు. వైష్ణవ్ తేజ్ బాడీ లాంగ్వేజ్ బాగుంది, ఫిట్ గా కనిపిస్తున్నాడు. ట్రైలర్ ట్రెండ్ అవుతుండడంతో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ‘ఆదికేశవ’ చిత్ర యూనిట్ కి ఆల్ ది బెస్ట్ చెప్తూ ట్వీట్ చేసాడు. నవంబర్ 24న ఆడియన్స్ ముందుకి రానున్న ఈ మూవీతో పంజా వైష్ణవ్ తేజ్ హిట్ ట్రాక్ ఎక్కాలని మెగా ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. మరి టెంపుల్ బ్యాక్ డ్రాప్ లో ఇప్పటికే తెలుగులో చాలా సినిమాలు వచ్చాయి, వాటికి ‘ఆదికేశవ’ సినిమాకి మధ్య డిఫరెన్స్ ని ఎలా చూపిస్తారు అనేది చూడాలి? ఎంత కొత్తగా కథని ప్రెజెంట్ చేస్తారు అనే దానిపైనే ఈ మూవీ రిజల్ట్ ఆధారపడి ఉంది.

Show comments