మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ ‘ఆర్ఆర్ఆర్’ రిలీజ్ కోసం ఏమాత్రం రెస్ట్ లేకుండా ప్రమోషన్లలో పాల్గొన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం తన నెక్స్ట్ మూవీ విడుదలకు కాస్త సమయం ఉండడంతో రిలాక్స్ అవుతున్నారు. రామ్ చరణ్ దర్శకుడు శంకర్ తాజా చిత్రం కొత్త షెడ్యూల్‌లో పాల్గొనవలసి ఉంది. కానీ దానికి ముందు ఆయన తన తండ్రి “ఆచార్య”ని పెద్ద ఎత్తున ప్రమోట్ చేయాలనుకుంటున్నాడు, ఇందులో చెర్రీ కూడా కీలక పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే.
Read Also : Sarkaru Vaari paata : కీలక అప్డేట్ ఇచ్చిన తమన్
అయితే మెగాస్టార్ చిరంజీవి సరసన కథానాయికగా నటించిన కాజల్ అగర్వాల్ ఈ చిత్రాన్ని ప్రమోట్ చేయాలని భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇంటర్వ్యూల కోసం హైదరాబాద్‌కు రావాలనుకుంటున్నట్టు చరణ్ కు చెప్పిందని అంటున్నారు. అయితే కాజల్ తన ఇప్పుడు గర్భవతి కావడంతో చరణ్ ఆమె ప్రమోషన్లలో పాల్గొనడానికి ఒప్పుకోలేదట. ఆమెను రెస్ట్ తీసుకోమని చెప్పాడట చెర్రీ. ఇక మెగాస్టార్ చిరు, రామ్ చరణ్‌లతో పాటు సినిమాలో మరో హీరోయిన్ గా నటించిన పూజా హెగ్డే ప్రమోషన్‌లలో చేరవచ్చు. “ఆచార్య” ఏప్రిల్ 29న తెలుగుతో పాటు హిందీ వెర్షన్ కూడా థియేటర్లలోకి రానుండడంతో ఈ సినిమాను ఇండియా అంతటా వీలైనంత భారీ స్థాయిలో ప్రమోట్ చేయాలని చరణ్ యోచిస్తున్నట్లు సమాచారం.
