NTV Telugu Site icon

RC 16: అనుకున్న దాని కన్నా ముందుగానే ప్లాన్ చేస్తున్నావా బుచ్చిబాబు?

Rc 16

Rc 16

ప్రస్తుతం క్రియేటివ్ డైరెక్టర్ శంకర్ తో ‘గేమ్ చేంజర్’ సినిమా చేస్తున్నాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్. ఈ డిసెంబర్ లేదా 2024 జనవరిలో రిలీజ్ కావాల్సిన ఈ మూవీ 2024 సమ్మర్ కి వాయిదా పడేలా కనిపిస్తోంది. శంకర్ ఇండియన్ 2 సినిమాని కూడా తెరకెక్కిస్తూ ఉండడంతో గేమ్ చేంజర్ మూవీ షూటింగ్ డిలే అవుతోంది. ఈ మూవీ నెక్స్ట్ షెడ్యూల్ మైసూర్ లో జూన్ 4 నుంచి స్టార్ట్ అవ్వనుంది. ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యాక గౌతం తిన్నునూరితో చరణ్ ఒక సినిమా చేయాల్సి ఉంది. ఆ మూవీ క్యాన్సిల్ అవ్వడంతో గౌతం ప్లేస్ లోకి బుచ్చిబాబు వచ్చి చేరాడు. స్పోర్ట్స్ డ్రామా జానర్ లో ‘ఒక విలేజ్ కథని పాన్ ఇండియా రేంజులో చెప్దాం’ అంటూ బుచ్చిబాబు, చరణ్ ని డైరెక్ట్ చెయ్యడానికి రెడీగా అయ్యాడు.

గేమ్ చేంజర్ సినిమా షూటింగ్ పార్ట్ కంప్లీట్ అయిన తర్వాతే చరణ్, బుచ్చిబాబు సినిమాని మొదలుపెడతాడని అంతా అనుకున్నారు కానీ మెగా ఫాన్స్ కి త్వరలోనే గుడ్ చెప్పేలా ఉన్నాడు బుచ్చిబాబు. చరణ్ తో దిగిన ఫోటోని సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన బుచ్చిబాబు, ‘ముందు ముందు ఎగ్జైటింగ్ డేస్ రాబోతున్నాయి’ అంటూ ట్వీట్ చేసాడు. ఈ ఫోటోలో చరణ్ చాలా సింపుల్ అండ్ స్టైలిష్ గా కనిపిస్తున్నాడు. ఈ ప్రాజెక్ట్ ని గేమ్ చేంజర్ అయిపోయాక ముందే సెట్స్ పైకి తీసుకోని వెళ్లేలా ఉన్నారు మేకర్స్. ‘ఆర్సీ 16’ అనే వర్కింగ్ టైటిల్ తో అనౌన్స్ అయిన ఈ మూవీని బుచ్చిబాబు ముందుగా ఎన్టీఆర్‌తో సినిమా చేయాలనుకున్నాడు కానీ తారక్ కి ఉన్న ఇతర కమిట్మెంట్స్ వల్ల ఈ కథ చరణ్‌ దగ్గరకి వెళ్లింది.

Show comments