NTV Telugu Site icon

Ram Charan: ఇది మావా సక్సస్ అంటే… పదేళ్లలో ‘ఇండియన్ బ్రాడ్ పిట్’ అనిపించాడు

Ram Charan

Ram Charan

ఒకప్పుడు మనం ఎక్కడ ఉన్నాం, ఇప్పుడు ఎక్కడ ఉన్నాం అనేదే సక్సస్ ని డిఫైన్ చేస్తుంది అంటారు. రామ్ చరణ్ లేటెస్ట్ ఫొటోస్ చూస్తుంటే అతని సక్సస్ రేంజ్ ఏంటో తెలుస్తుంది. సరిగ్గా పదేళ్ల క్రితం 2013లో రామ్ చరణ్ బాలీవుడ్ లో నటించిన మొదటి సినిమా ‘జంజీర్’ రిలీజ్ అయ్యింది. చరణ్ పక్కన అప్పటికే బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ ఇమేజ్ ఉన్న ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటించింది. అమితాబ్ నటించిన ‘జంజీర్’ సినిమాకి రీమేక్ గా తెరకెక్కిన ఈ మూవీతో రామ్ చరణ్ హిందీలో సెటిల్ అవుతాడని అంతా అనుకున్నారు కానీ జంజీర్ ఊహించని రిజల్ట్ ని ఫేస్ చేసింది. రామ్ చరణ్ ని ‘ఉడెన్ ఫేస్’ అంటూ క్రిటిక్స్ విమర్శలు చేశారు. ఒక్క ఎక్స్ప్రెషన్ లేదు అంటూ చరణ్ ని కామెంట్స్ కూడా చేశారు. సరిగ్గా పదేళ్ల తర్వాత రామ్ చరణ్ ఇప్పుడు గ్లోబల్ స్టార్ అయ్యాడు. ‘ఇండియన్ బ్రాడ్ పిట్’ చరణ్ అని ప్రపంచ సినీ వర్గాలు కాంప్లిమెంట్స్ అందిస్తున్నాయి. ఆర్ ఆర్ ఆర్ సినిమాతో చరణ్ సొంతం చేసుకున్న ఇమేజ్ అతనికి వరల్డ్ సినిమాలో స్పెషల్ క్రేజ్ వచ్చేలా చేసింది. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో నాటు నాటు సాంగ్ ఆస్కార్ కి నామినేట్ అయ్యింది, మార్చ్ 12న జరగనున్న ఆస్కార్ కోసం రామ్ చరణ్ ప్రమోషన్స్ చేస్తూ బిజీగా ఉన్నాడు.

ఇటివలే ఆస్కార్ ప్రీఈవెంట్స్ లో ప్రియాంక చోప్రా హోస్ట్ చేసిన ఒక ఈవెంట్ కి వెళ్లిన చరణ్, అక్కడ ప్రియాంక చోప్రా కలిసి దిగిన ఫోటో సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ అవుతోంది. పదేళ్ల క్రితం ఏ హీరో పక్కన ప్రియాంక చోప్రా నిలబడితే బాలీవుడ్ వర్గాలు నవ్వారో, ఈరోజు అదే హీరో పక్కన ప్రియాంక నిలబడిన ఫోటో వరల్డ్ వైడ్ ట్రెండ్ అవుతుంది. ఇది కదా అసలైన సక్సస్ అంటే… ప్రియాంక చోప్రాతో పాటు చరణ్ స్టార్ వార్ డైరెక్టర్ తో జేజే అబ్రమ్స్ తో దిగిన ఫోటో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. హాలీవుడ్ ప్రాజెక్ట్ కోసం డిస్కషన్ జరుగుతుందని చరణ్ రీసెంట్ గా చెప్పాడు కాబట్టి మిషన్ ఇంపాజిబుల్ 3, స్టార్ వార్స్, సూపర్ 8 లాంటి ప్రాజెక్ట్స్ ని డైరెక్ట్ చేసిన జేజే అబ్రమ్స్, రామ్ చరణ్ తో కలిసి ఒక్క ఇంటర్నేషనల్ మూవీ ప్లాన్ చేస్తాడేమో చూడాలి.

Show comments