Peddi Suspense : రామ్ చరణ్ పెద్దికి లైన్ క్లియర్ అవ్వలేదా?
- ‘పెద్ది’కి మినహాయింపు అంటూ వైరల్ అయిన వార్తలు
- పర్సంటేజ్ విధానంపై ఎగ్జిబిటర్ల కీలక క్లారిటీ
- ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని స్పష్టం
- కమిటీ రిపోర్ట్ తర్వాతే థియేటర్లపై ఫైనల్ నిర్ణయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్, స్టార్ డైరెక్టర్ బుచ్చిబాబు సన కాంబోలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం ‘పెద్ది’ (Peddi). ఈ సినిమా థియేట్రికల్ రిలీజ్, బిజినెస్ వ్యవహారాలకు సంబంధించి గత కొన్ని రోజులుగా ఫిలిం నగర్ సర్కిల్స్‌లో ఒక వార్త జోరుగా ప్రచారంలో ఉంది. థియేటర్ల యాజమాన్యాలు ప్రస్తుతం అమలు చేయాలని చూస్తున్న ‘పర్సంటేజ్ విధానం’ (కలెక్షన్లలో థియేటర్ల వాటా) నుండి ‘పెద్ది’తో పాటు టాలీవుడ్‌కు చెందిన మరో 16 పెద్ద సినిమాలకు మినహాయింపు లభించిందని, ఆ చిత్రాలకు పాత పద్ధతిలోనే బిజినెస్ క్లియర్ అయిపోయిందని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం సాగింది. అయితే, ఈ ప్రచారంలో ఎలాంటి నిజం లేదని ఎగ్జిబిటర్లు తాజాగా స్పష్టం చేశారు. రామ్ చరణ్ ‘పెద్ది’ సినిమా విషయంలో తాము ఇంకా ఎలాంటి తుది నిర్ణయం తీసుకోలేదని వారు తేల్చి చెప్పారు.
Also Read
- Raghava Lawrence: సూర్య, విక్రమ్లకే సాధ్యం కాని సాహసం.. లారెన్స్ చేతులెత్తేస్తాడా? లేక చరిత్ర తిరగరాస్తాడా?
- Shah Rukh Khan: వన్ ఇయర్లో రూ.2,490 కోట్ల లాస్.. అయినా ఆయనే కింగ్!
- Faria :దళపతి విజయ్ వారసుడు 'ఫ్యూచర్ సీఎం' .. సంజయ్‌పై నటి ఫరియా అబ్దుల్లా క్రేజీ కామెంట్స్!
- Faria: నేనింకా ఇల్లు కొనలేదు.. సందీప్ కిషన్ చెప్పాక కొనాలనుకున్నా.!
పర్సంటేజ్ విధానం మినహాయింపులపై వస్తున్న వార్తలన్నీ కేవలం పుకార్లేనని కొట్టిపారేశారు. థియేటర్ల నిర్వహణ ఖర్చులు, లాభనష్టాల బేరీజుల కోసం ఇప్పటికే ఒక ప్రత్యేక కమిటీ ఏర్పాటయిందని ఎగ్జిబిటర్లు ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఆ కమిటీ ఇచ్చే నివేదిక, తీసుకునే తుది నిర్ణయం మేరకే తాము మున్ముందు ఏ సినిమాకైనా థియేటర్లు కేటాయించడంపై ముందుకు వెళ్తామని స్పష్టం చేశారు. దీంతో రామ్ చరణ్ ‘పెద్ది’ చిత్రానికి పర్సంటేజ్ వివాదం నుండి ఇంకా పూర్తిస్థాయిలో లైన్ క్లియర్ కాలేదనే విషయం అర్థమవుతోంది. మరి ఈ సమస్యపై టాలీవుడ్ నిర్మాతలు, ఎగ్జిబిటర్ల కమిటీ కూర్చుని ఎలాంటి పరిష్కారం కనుగొంటారో వేచి చూడాలి.
తాజావార్తలు
-
Best Captain: కపిల్, ధోనీ, కోహ్లీ, రోహిత్.. నలుగురిలో బెస్ట్ కెప్టెన్ ఎవరో తేల్చేసిన యువరాజ్ సింగ్ తండ్రి..
-
Iran-UAE: ఇరాన్ విమానాలకు యూఏఈ షాక్.. అన్ని విమానాలు నిలిపివేత.. కారణమిదే!
-
Raghava Lawrence: సూర్య, విక్రమ్లకే సాధ్యం కాని సాహసం.. లారెన్స్ చేతులెత్తేస్తాడా? లేక చరిత్ర తిరగరాస్తాడా?
-
Khairatabad Ganesh : ఖైరతాబాద్‌లో షీ టీమ్స్ ఫుల్ ఫోకస్.. 1,100 కేసులు.!
-
Rahul Gandhi: ఇందిరా ఓడిపోయింది, బీజేపీ ఎందుకు ఓడిపోవడం లేదు.
ట్రెండింగ్
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!
-
Asian Games 2026లో భారత్ షెడ్యూల్ ఇదే.. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎప్పుడంటే?
-
144Hz డిస్ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!