Peddi: నైజాంలో రామ్ చరణ్ ‘పెద్ది’కి బిగ్ షాక్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రామ్ చరణ్ తేజ, ‘ఉప్పెన’ దర్శకుడు బుచ్చిబాబు సానా కాంబినేషన్లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘పెద్ది’. ఈ సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి. జూన్ 4వ తేదీన వరల్డ్ వైడ్ రిలీజ్‌కి రెడీ అవుతున్న ఈ సినిమాకి, టాలీవుడ్లో అత్యంత కీలకమైన ప్రాంతంగా భావించే తెలంగాణ నైజాం మార్కెట్లో ఊహించని ఎదురుదెబ్బ తగిలింది.
వాస్తవానికి వందల కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కే పాన్ ఇండియా సినిమాలకు, అలాగే తెలుగు భారీ బడ్జెట్ సినిమాలకు మొదటి వారం లేదా పది రోజుల పాటు టికెట్ రేట్లు పెంచుకునేలా ప్రభుత్వాలు స్పెషల్ జీవోలు ఇవ్వడం సాధారణం. అయితే ‘పెద్ది’కి కూడా అలా భారీగా రేట్లు పెంచుకునే అవకాశం ప్రభుత్వం ఇస్తుందని అందరూ ఆశించారు. అయితే ఈ విషయంలో ప్రభుత్వం జీవో జారీ చేసినా సరే, నైజాం ఎగ్జిబిటర్లు మాత్రం ఒక షాకింగ్ విషయం బయటపెట్టారు.
Also Read
- Bigg Boss Telugu 10: 'బిగ్ బాస్ తెలుగు 10'లో ఎవరు ఎంత సంపాదిస్తున్నారో తెలుసా?.. టాప్ లో ఆటో రామ్ ప్రసాద్..
- Hanuman Ansh: రూ.2 కోట్ల బడ్జెట్.. రూ.200 కోట్ల వసూళ్లు.. ఆ ఒక్క పొరపాటుతో ఆస్కార్ ఛాన్స్ మిస్
- Samantha: బేబీ బంప్‌తో సమంత కొత్త ఫోటోలు.. ప్రెగ్నెన్సీ గ్లోతో మెరిసిపోతున్న సామ్!
- Dhruv Vikram DV4: ఇన్ని రోజుల ‘DV4’ వివాదానికి ఎండ్ కార్డ్.. రమేష్ వర్మతోనే ధృవ్ విక్రమ్ సినిమా!
ఒకవేళ ప్రభుత్వం స్పెషల్ టికెట్ రేట్లకు అనుమతిస్తూ జీవో జారీ చేసినా సరే, తాము మాత్రం ఆ పెంచిన ధరలకు సినిమా ప్రదర్శించేది లేదని, ఇప్పుడున్న సాధారణ ధరలకు మాత్రమే సినిమా ఆడిస్తామని కుండబద్దలు కొట్టినట్లు ప్రకటించారు. ఈరోజు ఏర్పాటు చేసిన ఎగ్జిబిటర్ల సమావేశంలో ఎగ్జిబిటర్ల తరపున మాట్లాడుతూ దిల్ రాజు సోదరుడు శిరీష్ ఈ మేరకు కామెంట్ చేశారు.
నిజానికి ప్రస్తుతానికి తెలంగాణలో ఉన్న సింగిల్ స్క్రీన్ థియేటర్లకు పర్సంటేజీ విధానమే ఇవ్వాలని, రెంట్ విధానం ఇక వద్దని కొంతమంది ఎగ్జిబిటర్లు ఈరోజు ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. అందులో భాగంగానే ఈ మేరకు శిరీష్ మాట్లాడారు. కానీ ఇలా గనుక టికెట్ ధరలు పెంచకుండా నైజాంలో ప్రదర్శిస్తే, కలెక్షన్స్ మీద గట్టిగానే ప్రభావం పడే అవకాశం ఉందని చెప్పొచ్చు.
తాజావార్తలు
-
Bigg Boss Telugu 10: ‘బిగ్ బాస్ తెలుగు 10’లో ఎవరు ఎంత సంపాదిస్తున్నారో తెలుసా?.. టాప్ లో ఆటో రామ్ ప్రసాద్..
-
US Open 2026: సబాలెంకాను ఓడించి ఎలెనా రిబాకినా చరిత్ర.. తొలిసారి యూఎస్ ఓపెన్ టైటిల్
-
Hanuman Ansh: రూ.2 కోట్ల బడ్జెట్.. రూ.200 కోట్ల వసూళ్లు.. ఆ ఒక్క పొరపాటుతో ఆస్కార్ ఛాన్స్ మిస్
-
Jana Sena : ఖమ్మంలో ఇవాళ జనసేన తెలంగాణ శంఖారావం.. భారీగా నేతలు, కార్యకర్తల రాక
-
BRICS Summit 2026: BRICSకి 20 ఏళ్లు.. ప్రత్యేక స్మారక తపాలా బిళ్లలు విడుదల చేసిన భారత్.. వీటి ప్రత్యేకత ఇదే
ట్రెండింగ్
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!