Venkata Satish Kilaru: 60% మేకింగ్.. 40% రెమ్యూనరేషన్.. రామ్ చరణ్ ‘పెద్ది’ సినిమా బడ్జెట్ లెక్కలివే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Venkata Satish Kilaru: టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో గత కొంతకాలంగా సినిమాల బడ్జెట్లు, హీరోల రెమ్యూనరేషన్లు, థియేటర్లలో టికెట్ ధరలపై పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. తాజాగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ – డైరెక్టర్ బుచ్చిబాబు కాంబినేషన్లో వచ్చిన ‘పెద్ది’ సినిమా విజయవాడ ఈవెంట్లో ఈ చిత్ర బడ్జెట్ దాదాపు 350 కోట్లు అయిందనే వార్త తెరపైకి వచ్చింది. ఈ సినిమా రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్‌తో దూసుకుపోతున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రెస్ మీట్లో పెద్ది నిర్మాత వెంకట సతీష్ కిలారు సినిమా కాస్టింగ్‌ను కంట్రోల్ చేయడం, ప్రేక్షకులకు అందుబాటు ధరల్లో టికెట్లు ఇవ్వడంపై అడిగిన ప్రశ్నలకు స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా సమాధానాలు ఇచ్చారు.
సినిమా ఖర్చులు పెరిగిపోతున్నాయనే ప్రశ్నపై నిర్మాత సానుకూలంగా స్పందించారు. “మీరు చెప్పిన పాయింట్ వందకు వంద శాతం కరెక్ట్. కానీ ప్రస్తుతం మనం కేవలం తెలుగు ఇండస్ట్రీ గురించే ఆలోచించడం లేదు. మన ఇండస్ట్రీ నుంచి పాన్ ఇండియా, పాన్ వరల్డ్ స్థాయికి వెళ్లాలని ప్రయత్నిస్తున్నాం. ఆ ప్రయత్నంలో కొన్ని సినిమాలు సక్సెస్ అవుతున్నాయి, కొన్ని అవ్వట్లేదు. ఇలాంటి భారీ బడ్జెట్ సినిమాలు సంవత్సరానికి రెండు మూడు మాత్రమే వస్తాయి. వాటి కోసం ఒక వారం, పది రోజులు రేట్లు పెంచినా.. ఆ తర్వాత మళ్లీ నార్మల్ రేట్లతో ఫ్రీ రన్ ఉంటుంది. సినిమా అద్భుతంగా రావాలన్నప్పుడు ఖర్చు పెట్టక తప్పదు” అని వెల్లడించారు. సినిమా బడ్జెట్లో ఎక్కువ భాగం హీరోలు, డైరెక్టర్ల రెమ్యూనరేషన్లకే పోతోందనే టాక్‌పై నిర్మాత మండిపడ్డారు. జనాల్లోకి తప్పుడు నరేటివ్ తీసుకెళ్తున్నారని చెప్తూ.. 350 కోట్ల బడ్జెట్లో దేనికి ఎంత ఖర్చయ్యిందో పర్సంటేజ్ లెక్కలతో సహా క్లారిటీ ఇచ్చారు.
Also Read
- Vijay Deverakonda: ఇచ్చిన మాట నిలబెట్టుకున్న విజయ్ దేవరకొండ.. రష్మికతో కలిసి సొంత ఊరిలో 180 మంది విద్యార్థులకు ‘పెళ్లి కానుక’!
- Ram Charan: ఈ కాంబో సెట్ అయితే థియేటర్లు దద్దరిల్లాల్సిందే.. రామ్ చరణ్ - శ్రీకాంత్ ఓదెల మూవీపై క్రేజీ బజ్!
- Buchi Babu: అచ్చియమ్మ క్యారెక్టర్ రేంజ్ ఏంటో బుధవారం చూస్తారు.. జాన్వీ కపూర్ రోల్‌పై డైరెక్టర్ బుచ్చిబాబు షాకింగ్ కామెంట్స్!
- Ananta Sriram: 'పెద్ది' ఐటమ్ సాంగ్ విమర్శలపై ఇచ్చిపడేసిన అనంత శ్రీరామ్.. ‘వాళ్లే అసలైన ఐటమ్ గాళ్లు’!
పెద్ది బడ్జెట్లో అత్యధికంగా 60 శాతం కేవలం సినిమా నిర్మాణానికి, విజువల్స్, లొకేషన్లు, గ్రాండియర్ కోసం ఖర్చు పెట్టినట్లు వెల్లడించారు. ఆర్టిస్టులు, డైరెక్టర్, ఇతర సాంకేతిక నిపుణుల రెమ్యూనరేషన్ల కోసం కేటాయించింది కేవలం 40 శాతం మాత్రమే అని చెప్పారు. “రెమ్యూనరేషన్ల వల్లే బడ్జెట్ పెరిగిపోతోందనడం ముమ్మాటికీ తప్పు. మేము కథను నమ్మాం. ఈ అద్భుతమైన సబ్జెక్ట్‌ను జనాల్లోకి బలంగా తీసుకెళ్లాలనే ఉద్దేశంతో మేకింగ్‌లో ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా అవుట్ అండ్ అవుట్ ఖర్చు పెట్టాం” అని నిర్మాత స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
Venkata Satish Kilaru: 60% మేకింగ్.. 40% రెమ్యూనరేషన్.. రామ్ చరణ్ ‘పెద్ది’ సినిమా బడ్జెట్ లెక్కలివే!
-
INDW Vs PAKW: రీచా ఘోష్ మెరుపు ఇన్నింగ్స్.. పాకిస్థాన్ ముందు భారత్ టార్గెట్ ఎంతంటే..
-
Harmanpreet Kaur: రోహిత్ శర్మ రికార్డును బద్దలు కొట్టిన హర్మన్‌ప్రీత్ కౌర్.. దేశ చరిత్రలోనే తొలి ప్లేయర్‌గా..
-
NEET UG 2026: నీట్ రాసే విద్యార్థులకు అలర్ట్.. అడ్మిట్ కార్డులు వచ్చేశాయి! ఇలా డౌన్లోడ్ చేసుకోండి..
-
Bhatti Vikramarka : చరిత్రను, భవిష్యత్తును గుండెకు హత్తుకున్న నగరం హైదరాబాద్
ట్రెండింగ్
-
Kitchen Hacks : నాన్-స్టిక్ అవసరమే లేదు.. ఈ ట్రిక్‌తో స్టీల్ పాత్రలే సూపర్.!
-
Child Safety Tips : స్కూల్స్ స్టార్ట్ అవుతున్నాయి.. పిల్లలకు ఈ 5 ‘అబద్ధాలు’ నేర్పించండి..!
-
Cleaning Hacks : పరుపు, దిండు నుంచి వాసన వస్తోందా.? ఈ ఒక్క చిట్కాతో నిమిషాల్లో ఫ్రెష్.!
-
Kitchen Tips : బియ్యాన్ని ఇలా కడగకపోతే అన్నం రుచి, ఆరోగ్యం రెండూ దెబ్బే.!
-
Rahamathullah Gurbaj: నా సెంచరీకి కారణం గౌతమ్ గంభీర్.. అఫ్గాన్ ఓపెనర్ ఆసక్తికర వ్యాఖ్యలు!